ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కొలాహలం మొదలైంది.  టిడిపి కూటమి, వైసిపి, కాంగ్రెస్ ల మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. ఇదే తరుణంలో వైసిపి ఎవరితో పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేసి దూసుకుపోతుంటే,  టిడిపి జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీనివల్ల చాలా నియోజకవర్గాల్లో టికెట్లు రానటువంటి వ్యక్తులు రెబల్ గా పోటీ చేశారు. అంతేకాకుండా  కొంతమంది ఆపోజిట్ క్యాండిడేట్లతో కుయుక్తులు పన్ని  నియోజకవర్గంలో టిడిపిని ఎలాగైనా ఓడగొట్టాలని ప్లాన్లు కూడా చేశారట. 

 దీంతో సీరియస్ గా తీసుకున్న టిడిపి అధిష్టానం వారిని సస్పెండ్ చేసేసింది. ఇందులో ముఖ్యంగా  అరకు నియోజకవర్గానికి చెందిన  అబ్రహం, అలాగే విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరిటాల శ్యాంసుందర్, పోలవరం నియోజకవర్గానికి చెందిన సూర్యచంద్రరావు,  ఉండి నియోజకవర్గానికి చెందిన వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డ రాజశేఖర్ లను టిడిపి నుంచి సస్పెండ్ చేసినట్టు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చేన్నాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే వీరందరినీ టిడిపి అధిష్టానంలో ఉన్న చంద్రబాబు, లోకేష్, అచ్చేన్నాయుడు ఎన్నిసార్లు పిలిచి బుజ్జగించినా కానీ మాట వినలేదు. చివరికి నామినేషన్లు ఉపసంహరణ చేసుకోండి అని బ్రతిమిలాడారట..అయినా మాట పట్టించుకోని వారు నామినేషన్లను ఉపసంహరించుకోలేదు.

ఇక చివరి అస్త్రంగా  వారందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు అచ్చెన్నాయుడు. వీరిని సస్పెండ్ చేయడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో వైసిపికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో టిడిపి ఓట్లు చీలిపోయి, వైసిపి గెలుపు తీరాలకు వెళుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అంతేకాకుండా  చాలా నియోజకవర్గాల్లో  ఎన్నికల సమన్వయకర్తలను నియమించారు.  ఈ క్రమంలోనే శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి ఎన్నికల సమన్వయకర్తగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నియమించారు. అలాగే 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు మరి కొంతమంది సమన్వయకర్తల్ని నియమిస్తూ  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: