ఆఫ్రికన్- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత హింసాకాండకు దిగిన నిరసనకారులు వాషింగ్టన్ డిసిలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా విడిచిపెట్టలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. మే 25 న మిన్నియాపాలిస్లో ఫ్లాయిడ్ మరణించిన తర్వాత పెద్ద ఎత్తున హింస చెలరేగింది. చివరికి ట్రంప్ బంకర్ లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్వేతసౌద పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ చేతిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. వైరల్ అయిన ఈ ఫుటేజ్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఐ కాంట్ బ్రీథ్ అనే ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. అతని మరణం దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలకు దారితీసింది, కొంతమంది నిరసనకారులు దేశవ్యాప్తంగా విధ్వంసం, దోపిడీ మరియు అల్లర్లకు దిగారు. వాషింగ్టన్ డిసిలోని గాంధీ విగ్రహాన్ని నాశనం చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్... "వారికి గాంధీ మీద కూడా కోపం ఉంది. గాంధీ కోరుకున్నది ఒక విషయం, శాంతి... అది సరియైనదా ? కాదా...? ఆయన విగ్రహాన్ని పడగొట్టడం మంచిది కాదు. వారు ఎం చేస్తున్నారో వారికి తెలియదని నేను అయితే అనుకోను అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

"వారు కేవలం దుండగుల సమూహం అని నేను అనుకుంటున్నాను” అని ట్రంప్ అన్నారు. ఇలాంటి దుండగులను పదేళ్ల జైలు శిక్ష విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఇప్పుడు, విగ్రహాలను పడగొట్టడం గురించి కూడా ఎవరూ మాట్లాడరని ఆయన పేర్కొన్నారు. ధ్వంసం చేసిన విగ్రహాన్ని నేషనల్ పార్క్ పోలీసులు మరియు విదేశాంగ శాఖ సహాయంతో ఇక్కడి భారత రాయబార కార్యాలయం తరువాత పునరుద్ధరించింది. కాగా ట్రంప్ భారతీయులను ఆకట్టుకోవడానికి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు అంటున్నారు. ట్రంప్ వైఖరిపై ఇప్పుడు భారతీయులు కూడా కాస్త ఆసక్తిగానే చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: