అమెరికా అధ్యక్ష , ఉపాధ్యక్షులుగా బిడెన్, కమలా హరీస్ ల ప్రమాణ స్వీకారం ఎంతో వైభవంగా జరిగింది. అతిరధ మహారధులు మధ్య జరిగిన ఈ వేడుకలలో మన కమలమ్మే కొట్టొచ్చినట్టు కనపడింది. పర్పుల్ కలర్ డ్రస్ తో కనిపించిన కమలా హరీస్ ఆ డ్రెస్ వెనుక ఉన్న విషయాన్ని కూడా వెల్లడించింది. ఇది నల్లజాతీయుల కోసం, మహిళల హక్కుల కోసం పోరాడిన ఓ మహిళనేత కు గుర్తుగా ధరించానని తెలిపింది అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించిన తరువాత కమలా హరీస్ ప్రమాణ స్వీకారం జరిగింది, ఆ తరువాత బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటి భారతీయ అమెరికన్, ఆఫ్రో అమెరికన్ గా కమల రికార్డ్ సృష్టించారు. అయితే
కమలా హరీస్ ప్రమాణ స్వీకార సమయంలో ఆమె మాట్లాడిన మాటలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరిని కదిలించాయనే చెప్పాలి. ప్రపంచం మొత్తం చెవులప్పగించుకుని మరీ కమలా హరీస్ ప్రసంగం వింది. కమల హరీస్  ప్రమాణ స్వీకార మహోత్సవం లో తన తల్లి గురించి , హక్కుల గురించి పోరాటాలు చేసిన ఎందరో మహిళలు గురించి ప్రస్తావించారు. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణమైన  ఏకైక వ్యక్తి మా అమ్మ  శ్యామల గోపాలం ఆమె ఎప్పుడూ నా హృదయాంతరాల్లో నే ఉంటారని అన్నారు. ఈ విజయం మహిళలందరికీ చెందుతుందని ఎన్నో ఏళ్లుగా హక్కులకోసం పోరాడిన మహిళలు అలాగే రాజ్యాంగ సవరణ పోరాడి సాధించిన మహిళలు ఓటింగ్ రైట్స్ కోసం పోరాడి సాధించిన మహిళలకు చెందుతుందని ఇప్పుడు నేను వాళ్ల భుజాలపై నిలబడి ఉన్నానని మనస్సుకు హత్తుకునేలా వ్యాఖ్యానించారు..ఇదిలాఉంటే
కమలా హరీస్ ప్రసంగం తరువాత కమలా హరీస్ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. కమలా హారీస్ ఉపాధ్యక్షురాలిగా కంటే కూడా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారంచేసి ఉంటె బాగుండేది అనేంతగా ఆమె కనిపించారు, మరిపించారు. అయితే ప్రస్తుతానికి కమలా హరీస్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నా భవిష్యత్తులో అమెరికా కాబోయే అధ్యక్షురాలు మన కమలే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఒక వైపు భారతీయుల మద్దతు, మరో వైపు నల్లజాతీయుల, అమెరికన్స్ మద్దతు పూర్తిగా , పుష్కలంగా ఉన్న ఏకైక  మహిళ హారీస్ కావడంతో పాటు, ఉపాధ్యక్షురాలిగా ఆమెకు ఉన్న క్రేజ్ 2024 లో కమలా హరీస్ ను అధ్యక్ష పీటంపై కూర్చోబెట్టనున్నాయని. భవిష్యత్తు అమెరికాకు కాబోయే అధ్యక్షురాలు కమలా హారీస్ అనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: