
ముఖ్యం గా చైనా ఇతర దేశాల నుంచి మేధో చౌర్యానికి పాల్పడుతూ ఉంటుంది. అంటే ఇతర దేశాలలో ఏదైనా వస్తువును తయారు చేస్తే దానికి సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగలించడం అచ్చంగా అలాంటి వస్తువులను తయారు చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇలా ఇప్పటివరకు రష్యా నుంచి ఎన్నో ఆయుధాలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని దొంగలించి ఇక పేరుమార్చి అలాంటి ఆయుధాలను తయారు చేయడం కూడా చేసింది. ఆయుధాల విషయంలోనే కాదు అన్ని రకాల వస్తువుల విషయంలో కూడా ఇలా చైనా మేధో చౌర్యానికి పాల్పడుతోంది
దాదాపు అన్ని దేశాలు కూడా చైనా నుంచి ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నాయి. ఒక ఇజ్రాయిల్ మాత్రమే చైనా బుద్ధుని ముందు గానే పసిగట్టి మొదటి నుంచి దూరం గా పెడుతూ వచ్చింది. అయితే చైనా బ్రతుకు ఏంటి అన్న విషయాన్ని ఇటీవలే ఇటలీ తేల్చి చెప్పింది. తమ దేశం లో తయారు చేసినటువంటి డ్రోన్ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించెందుకు చైనా ప్రయత్నించింది అన్న విషయాన్ని అక్కడ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించిందట. ఈ విషయాన్ని అధికారికం గా వెల్లడించింది ఇటలీ ప్రభుత్వం. ఇలా చైనా మేధో చౌర్యం చేస్తుంది అన్న విషయాన్ని నిక్కచ్చిగా బయట పెట్టి చైనా బ్రతుకు ఏంటో చెప్పకనే చెప్పింది ఇటలీ.