ప్రపంచంలో ఎక్కడ చూసినా మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి.  అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు ఇలా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి.  ఆయా దేశాల చట్ట ప్రకారం అలాంటి దుర్మార్గులకు శిక్షలు విధిస్తున్నా...ఎంత మాత్రం మార్పులు రావడం లేదు.  చిన్నా, పెద్దా అనే తార తమ్యాలు లేకుండా మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు.  తాజాగా సోమాలియాలో ఘోరం జరిగింది.
Image result for somalia law
11 మందిని పెళ్లి చేసుకున్న ఓ మహిళను అల్‌ షబాబ్‌ మిలిటెంట్లు రాళ్లతో కొట్టి చంపారు. షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్‌ అనే మహిళ  పదకొండ మంది పురుషులను విడాకులు ఇవ్వకుండా వివాహం చేసుకుంది.  కాగా, సోమాలియా రాజధాని మొగదిషుకు చుట్టు పక్కల ప్రాంతాల్లో తరచూ రైడ్స్‌ నిర్వహించే అల్‌ షబాబ్‌ మిలిటెంట్లు ఈమెను పట్టుకున్నారు. అంతే కాదు దారుణంగా ఆమెకు శిక్ష విధించారు.
Somali Al-Shebab fighters gather on February 13, 2012 in Elasha Biyaha, in the Afgoei Corridor, after a demonstration to support the merger of Al-shebab and the Al-Qaeda network.
విడాకులు ఇవ్వకుండా 11 మందిని పెళ్లి చేసుకున్నందుకు షరియా చట్టం ప్రకారం రాళ్లతో కొట్టిచంపాలని నిర్ణయించారు.ఆమెను గొంతు వరకూ భూమిలో పూడ్చి రాళ్లతో కొట్టి చంపారు.  చనిపోయిన షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్‌ కి ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. అయితే విచారణ సమయంలో మహిళ భర్తలను పిలిపించామని, ఆమె తన భార్య అంటే తన భార్య అని ప్రతి ఒక్కరూ సమాధానం ఇచ్చారని అల్‌ షబాబ్‌ గవర్నర్‌ ఒకరు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: