జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం నేతలు టార్గెట్ గా వాళ్లని ఏదో ఒక కేసులో ఇరికించి శిక్ష పడేలా చేసేలా కార్యాచరణ నడుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుపై ముప్పైకి పైగా కమిటీలూ, ఎంక్వైరీలు వేశారు. వంద రోజుల నుంచి తవ్వుతున్న చంద్రబాబు విషయంలో జగన్ మోహన్ రెడ్డికి ఒక్క క్లూ కూడా దొరకలేదు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం నేతలపై ఫోకస్ పెట్టారు. అక్కడ ఉన్న నేతలపై పాత కేసులన్నీ తిరగదోడుతున్నారు. కోడెల లాంటివారిపై కావల్సినన్ని కేసులు పెట్టించి మరీ టార్గెట్ చేస్తున్నారు.


ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇదేమీ పెద్ద నేరాలు కూడా కావు. అయితే ఏదైనా తప్పు తప్పే కాబట్టి తప్పు చేసిన వారిని సమర్థించలేము కానీ, రాజకీయ కక్ష గురించి మాత్రం ప్రస్తావించాలి. ఈ క్రమంలోనే జగన్మోహనరెడ్డి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిఐ విచారణ కోరారు. గురిజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిందితుడిగా ఉన్న అక్రమ మైనింగ్ కేసుపై సీబీఐ విచారణ చేయించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.



ఈ కేసు హైకోర్టులో ఉండటంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపింది. అయితే చంద్రబాబు హయాంలో సీబీఐకి రాష్ట్రంలోకి వచ్చే అధికారం లేదు. దీంతో జగన్ ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి అవసరమైన జనరల్ కన్సెంట్ ను పునరుద్ధరించింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు చెప్పింది, ఇప్పుడు ప్రభుత్వం తరపున సీబీఐ విచారణ కావాలని కేంద్రానికి లేఖ రాస్తే జగన్ వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో తొలి సిబిఐ కేసు అవుతుంది. అయితే యరపతినేని శ్రీనివాసరావు వర్గీయులు మాత్రం ఎలాంటి విచారణకైనా సిద్ధమని కానీ రాజకీయ కక్ష సాధింపు మాత్రం మంచిది కాదని అంటున్నారు.



చంద్రబాబు అధికారంలో ఉండగా ఎలాంటి రాజకీయ కక్ష చెయ్యలేదని గుర్తు చేస్తున్నారు. ఇలా నేతలపై కేసులు పెట్టుకుంటూ ఇబ్బంది పెడితే జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన రోజున అనేక కేసులున్న వైసీపీ నాయకులపై కూడా ఇలాగే కక్ష తీర్చుకునే రోజు వస్తుందని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజాసమస్యలపై కాకుండా ఇలా రాజకీయ కక్షలతోనే రాజకీయం గడిచిపోతోంది. అయితే ఇదే సందర్భంలో తప్పు ఎవరు చేసినా తప్పే వారికి చట్ట ప్రకారం శిక్షలు పడాల్సిందే అది టిడిపి అయినా వైసీపీ అయినా.





మరింత సమాచారం తెలుసుకోండి: