
క్యారెట్ హల్వా ఎన్నో సార్లు తిని ఉంటారు.... క్యారెట్ స్వీట్ ఎన్నో సార్లు తిని ఉంటారు. బాదం స్వీట్ కూడా ఎన్నోసార్లు తిని ఉంటారు. అలాంటి ఈ క్యారెట్, బాదం స్వీట్ ని ఎప్పుడైనా కలిపి తిన్నారా ? అసలు ఈ వంటకం పేరు విన్నారా ? ఎంత బాగుంటుందో తెలుసా ? క్యారెట్ బాదం స్వీట్. ఈ స్వీట్ ని ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు..
బాదం పప్పు - 1 కప్పు,
పంచదార - 2 కప్పులు,
వెన్న - అర కప్పు,
కారెట్ - 1,
యాలకుల పొడి - అర టీ స్పూను.
తయారీ విధానం...
బాదం పప్పుని ఒక రాత్రంతా నానబెట్టాలి. క్యారెట్ ని కూడా మైక్రోవేవ్‌లో ఉడికించాలి. బాదం, క్యారెట్ లను కొద్దిగా నీరు, లేదా పాలు కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాత్రలో పంచదార, వెన్న వేసి బాదం మిశ్రమం కలిపి మళ్లీ మైక్రోవేవ్‌లో పెట్టాలి. పైన రంధ్రాలు పడినట్టు కన్పించగానే యాలకుల పొడి చల్లి, నెయ్యిరాసిన పళ్లెంలో వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.