దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార నిందితులకు పాటియాలా హౌస్ కోర్ట్ డెత్ వారెంట్ జారి చేసింది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు డెత్ వారెంట్లు జారి చేసింది కోర్ట్. తాజాగా జారి చేసిన డెత్ వారెంట్ ప్రకారం  మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు ముకేశ్‌ కుమార్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ను తీహార్ జైలు అధికారులు ఒకేసారి ఉరితీయనున్నారు. వారిని ఉరి తీయాలని సోమవారం పాటియాలా హౌస్ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. ఇక ఇదిలా ఉంటే వారికి ఉరికి సంబంధించి డెత్ వారెంట్ ఇవ్వడం ఇది మూడో సారి. 

 

గతంలో వారికి రెండు సార్లు డెత్ వారెంట్ ఇచ్చినా సరే వారికి న్యాయపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకునే వెసులుబాటు ఉన్న నేపధ్యంలో ఉరి శిక్ష అనేది వాయిదా పడుతూ వచ్చింది. ఇక వారిని ఉరి తీయాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ  హైకోర్ట్ సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళింది.  నలుగురు నిందితులను ఒకేసారి ఉరి తీయాలి అనే రూల్ ఉన్న నేపధ్యంలో ఉరి వాయిదా పడుతూ వస్తుంది. అయితే వారిని ఒక్కొకరిని ఉరి తీయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. నలుగురు ఒకే కేసులో దోషులు కాబట్టి వారిని ఒకసారే ఉరి తీయాలని కోర్ట్ స్పష్టం చేసింది. 

 

వారిలో ఒక్కరికి మాత్రమే న్యాయ ఆవకాశాలు అన్నీ పూర్తి అయి ఉరి శిక్ష అమలుకు సిద్దంగా ఉన్నాడు. మిగిలిన ముగ్గురు దోషులకు పెండింగ్ లో లోనే ఉన్నాయి. దీనితో మన దేశ న్యాయవ్యవస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు చట్టాలతో సంబంధం లేకుండా నిర్భయ ని దారుణంగా రేప్ చేసి చంపినప్పుడు ఏ చట్టం అడ్డు రాలేదని, కాని ఇప్పుడు శిక్ష వేయడానికి మాత్రం మన గొప్ప ప్రజాస్వామ్య దేశ అన్ని అవకాశాలను కల్పిస్తుంది అంటూ పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: