సంసృతి సంప్రదాయాలకు మన దేశం పెట్టింది పేరు.. కానీ కొందరి నీచమైన ప్రవర్తన వల్ల మన దేశానికి చెడ్డపేరు వస్తుంది.. అసలే కరోనా వల్ల మన భారతీయులు విదేశాల్లో చిక్కుకు పోతే, విదేశీయులు కూడా మనదేశంలో లాక్ అయ్యారు. ఇలాంటి వారిపట్ల మర్యాదగా ప్రవర్తించవలసింది పోయి కామంతో బుసలు కొడుతున్నారు.. అందుకు నిదర్శనమే ఈ ఘటన.


హర్యానాలో కరోనాతో చిక్కుకుపోయిన విదేశీ పర్యాటకురాలిపై హోటల్ సిబ్బంది సామూహిక అత్యాచారం చేసిన అమానుష ఘటన చోటు చేసుకుంది. ఉచ్చ నీచాలు మరచి ప్రవర్తిస్తున్న వారు రోజు రోజుకు సమాజంలో పెరుగుతున్నారు. ఇలాంటి వారిని ఏం చేసిన పాపం లేదు.. మానవ సంబంధాలను చిత్తు కాగితాల్ల భావించే కొందరి పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తే తప్ప బుద్ధి రాదంటున్నారు..


ఇకపోతే మార్చిలో విజిటింగ్ వీసాపై థాయ్‌లాండ్‌కి చెందిన మహిళ(41) ఇండియా పర్యటనకు వచ్చారు. అదేసమయంలో కరోనా రావడం లాక్‌డౌన్ విధించడం జరిగిపోయింది. ఈ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆమె ఇక్కడే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో ఆమె హిసార్‌లోని రెడ్‌ స్క్వేర్ మార్కెట్ ఏరియా హోటల్ రీజెన్సీలో బస చేశారు.


అక్కడ మేనేజర్ గా పనిచేస్తున్న గుల్షాన్ అనే వ్యక్తి విదేశీ మహిళపై కన్నేసిన, అతని అనుచరుడితో కలిసి ఆమెపై దారుణానికి తెగబడ్డారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె నిద్రిస్తుండగా గదిలోకి బలవంతంగా చొరబడి గ్యాంగ్ రేప్ చేశారు. ఇద్దరూ ఆమెపై పడి పశువాంఛ తీర్చుకున్నారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు తెలుపడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కాగా రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు మేనేజర్ గుల్షాన్‌ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. ప్రస్తుతం ఈ ఘటన మనుషుల రూపంలో తోడేళ్లలా ప్రవర్తిస్తున్న మృగాళ్ల మనస్తత్వానికి అద్దం పడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: