గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పటికప్పుుడు టెన్షన్ టెన్షన్ గా నడుస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ పై టీడీపీ, జనసేన, బీజేపీ ఎప్పటికప్పుుడు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపిలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.  ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బీజేపీ నేతలు చలో అమలాపురానికి పిలుపునిచ్చారు. వరుస సంఘటనలను ఖండిస్తూ.. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని ప్రాంతాల నేతలు కార్యక్రమానికి తరలిరావాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు.  దీంతో బిజెపి నేతలు, కార్యకర్తలు శుక్రవారం అమలాపురం చేరుకోవడానికి సిద్ధపడ్డారు. వారిని పోలీసుుల ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.  

బిజెపి నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి వంటి ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కారంచేడులో బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరిని హౌస్ అరెస్టు చేశారు. ఛలో అమలాపురం కార్యక్రమానికి బయలుదేరడానికి సిద్ధపడడంతో ఆమెను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.  దాదాపు 600 మంది అదనపు బలగాలను అమలాపురంలో మోహరించారు. బీజేపీ ముఖ్య నేతలను ముందస్తుగా హౌజ్ అరెస్టులు చేశారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అమలాపురం చేరుకోగా ఆయన్ను అరెస్టు చేశారు. నిరసనల నేపథ్యంలో పట్టణంలోని షాపులు బంద్ చేయాలని వ్యాపారులు నిర్ణయించారు.  

అటు విజయవాడ నుంచి అమలాపురానికి బయలుదేరిన పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు భద్రత పెంచారు. వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు  అమలాపురం డివిజన్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూడు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా ఉన్నా, ఏ విధమైన ఆయుధాలు కలిగి ఉన్నా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: