వివాదాస్పద తీర్పులు...విచిత్రమైన కామెంట్లు... లైంగిక వేధింపులకు కొత్త భాష్యం... బహిరంగంగానే పోలీసుల దర్యాప్తులపై విమర్శలు...ముంబై హైకోర్టు జడ్జ్‌ తీసుకున్న నిర్ణయాలకు...సుప్రీం బ్రేక్‌ వేసింది. ఆమె శాశ్వత హోదా కల్పించకూడదని నిర్ణయం తీసుకుంది.

జస్టిస్‌ పుష్ప గనేడివాలా...బాంబే హైకోర్టులో నాగ్‌పూర్‌ బెంచ్‌ న్యాయమూర్తి. వివాదాస్పద తీర్పులతో...పతాక శీర్షికలకు ఎక్కుతున్నారు. కేసుల విచారణ సందర్భంగా...విచిత్రకర అంశాలను తెరపైకి తెస్తున్నారు.  కొన్ని రోజు క్రితం...చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులను విచారించారు. 12 ఏళ్ల బాలికను...39 ఏళ్ల వ్యక్తి వేధింపులకు గురి చేశాడు. ఈ కేసును విచారించిన జస్టిస్ పుష్ప...అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు వ్యక్తుల శరీరాలు తాకనందున...లైంగిక వేధింపులుగా పరిగణించలేమంటూ తీర్పు ఇచ్చారు.

ఇదొక్క తీర్పుతోనే...దేశవ్యాప్తంగా జస్టిస్‌ పుష్ప పేరు...అందరికీ తెలిసిపోయింది.  ఆ తర్వాత అయిదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులోనూ ఇలాంటి తీర్పునే ఇచ్చారు. మైనర్‌ బాలికల చేతులు పట్టుకోవడం, వారి ముందు పురుషులు బట్టలు విప్పడం... లైంగిక వేధింపుల కిందికి రాదని తీర్పు వెల్లడించారు. వేధింపుల నుంచి బాలికలను రక్షించే పోక్సో చట్టం కింద వీటిని నేరంగా పరిగణించలేమన్నారు. నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేశారు. అయితే ఈ తీర్పులు తీవ్ర దుమారం రేపాయి. జస్టిస్‌ పుష్ప ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

జస్టిస్‌ పుష్ప తీర్పులను...అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. సదరు జడ్జి వ్యాఖ్యలు ఆందోళనకరమన్న ఆయన...భవిష్యత్‌లో ప్రమాదకరంగా మారుతాయని వ్యాఖ్యానించారు. జస్టిస్‌ పుష్ప...తీర్పులు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఈ తీర్పుల వల్ల నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆమెకు శాశ్వత హోదా కల్పించే సిఫార్సులను వెనక్కి తీసుకుంది.

మొత్తానికి ముంబయి హైకోర్టులో నాగ్ పూర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా నిర్ణయాలు ఇపుడు వివాదాస్పదమవుతున్నాయి. ఆమె తీర్పులతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసును విచారించిన ఆమె.. వెల్లడించిన నిర్ణయాలు ఇపుడు వివాదాస్పదమవుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: