రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆరా తీసిన ఏఐసిసి.. పలువురు నేతలకు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యవహారం రచ్చకెక్కడంతో ఏఐసిసి సీరియస్ అయింది.అందువల్లే రాజీనామాపై ఆయన వెనక్కి తగ్గారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. నాయకులకు సంబంధించిన నివేదికను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం టాగూర్ ఏఐసీసీ కి అందించారని అందువల్లే ఏఐసిసి హెచ్చరికలు జారీ చేసిందని టాక్.

 అసంతృప్తి నేతలకు ఏఐసీసీ చురకలంటిస్తోంది. జగ్గారెడ్డి వ్యవహారాన్ని సాకుగా చూపిస్తూనే పార్టీ నేతలకు వార్నింగ్స్ పంపించింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కె సి వేణుగోపాల్ నుంచే హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుత రాద్దాంతానికి కేంద్ర బిందువైన జగ్గారెడ్డికి మాత్రం ఇంకా ఏఐసీసీ నుంచి పిలుపు రాలేదు. పిసిసి చీఫ్ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలను మందలిస్తూనే మరోవైపు రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కీలకంగా చక్రం తిప్పుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజీనామాపై ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. ఇందుకు ఏఐసిసి హెచ్చరికలే కారణమని తెలుస్తోంది. మరోవైపు మార్చిలో రాహుల్ గాంధీ సభ అంటూ జగ్గారెడ్డి ప్రకటించడం సైతం కరెక్ట్ కాదంటున్నారు. సంగారెడ్డిలో రాహుల్ సభ పెడతామంటూ జగ్గారెడ్డి ప్రకటించడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు సైతం ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తాజా పరిణామాల్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం టాగూర్ కీలకంగా మారారు.

 ఇటీవల పరిణామాలన్నీ ఆయనే ఏఐసీసీకి నివేదించారు. రేవంత్ రెడ్డి వెంట నడుస్తున్న నేతలు, చేపడుతున్న కార్యక్రమాలు, డిజిటల్ మెంబర్షిప్ లో కీలకంగా వ్యవహరించిన నాయకులతో పాటు అసంతృప్తి నేతల ప్రకటనలన్నీ ఏఐసీసీ పెద్దలకు అందించారు. పార్టీలో రేవంత్ వ్యతిరేక వర్గం పై ఫోకస్ పెట్టాలని ఏఐసీసీకి సూచించారు.ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ నుంచి రాష్ట్ర నేతలకు హెచ్చరికలు జారీ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: