తాజా వ్యవహారం చూస్తుంటే అదే అనుమానాలు మొదలయ్యాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలను భారతదేశానికి రప్పించాల్సిందే అంటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన గొంతును సవరించుకున్నారు. నేతాజీ అస్తికలను జపాన్లో ఉన్న రెంకోజి టెంపుల్ నుండి భారత్ కు రప్పించాల్సిందే అంటు పవన్ డిమాండ్లు మొదలుపెట్టారు. తాను డిమాండ్ చేయటమే కాదు కేంద్రాన్ని డిమాండ్ చేయమని యావత్ దేశంలోని యువతను ఉసిగొల్పుతున్నారు.





పవన్ పిలుపువిని దేశంలోని యువత రెచ్చిపోతే అది నరేంద్రమోడి సర్కార్ కు పెద్ద సమస్యగా మారే అవకాశముంది. నేతాజీ మరణం ఇప్పటికీ మిస్టరీయే. చనిపోయాడని కొందరు లేదు లేదు ఇంకా బతికే ఉన్నాడని కొందరు వాదించుకోవటం మనం చూస్తునే ఉన్నాం. పవన్ డిమాండ్ చేస్తున్నట్లు నేతాజీ అస్తికలు జపాన్లోని రెంకోజీ టెంపుల్లో ఉన్నది వాస్తవమే అయితే అసలక్కడ ఎందుకున్నాయనేది పెద్ద ప్రశ్న.





దశాబ్దాలుగా నేతాజీ అస్తికలు జపాన్లో ఉంటే మన ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి ? ఇపుడీ ప్రశ్నలన్నీ యువత నుండి మొదలైతే సమాధానం చెప్పుకోవటం నరేంద్రమోడి సర్కార్ కు ఇబ్బందే. మోడీ సర్కార్ కు ఇబ్బందని తెలిసీ నేతాజీ అస్తికల అంశాన్ని పవన్ ఎందుకని లేవనెత్తినట్లు ? మొన్నటికిమొన్న ప్రభుత్వ వ్యతిరేకఓట్లు చీలనిచ్చేది లేదని చెప్పారు. టీడీపీతో పొత్తుకు రెడీయే అంటు పరోక్షంగా సిగ్నల్ ఇఛ్చారు.





ఆ సిగ్నల్లో నుండి లాక్కోలేక పీక్కోలేక బీజేపీ నేతలు నానా అవస్తలు పడుతున్నారు. ఆ సమస్యే అలాగుంటే తాజాగా నేతాజీ అస్తికల అంశాన్ని కెలికారు. ముందు ముందు ఈ విషయంలో పవన్ ఏమన్నా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారేమో తెలీదు. అదే జరిగితే బీజేపీ బాగా ఇబ్బందుల్లో పడిపోవటం ఖాయం. మిత్రపక్షం ఇబ్బందుల్లో పడుతుందని తెలిసీ పవన్ ఎందుకు ఇదంతా చేస్తున్నట్లు ? రివర్స్ గేర్ వేసి తెగతెంపులు చేసుకునే ఎత్తుగడలో ఉన్నారా ? చూద్దాం రోజుల్లో తేలిపోతుంది కదా ఏ సంగతి.





మరింత సమాచారం తెలుసుకోండి: