కొత్త సంవత్సరంలో మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. స్మాల్ సేవింగ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారికి త్వరలోనే శుభవార్త చెప్పనుంది..డిసెంబర్ 31, 2022న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 నాల్గవ త్రైమాసికంలో జనవరి నుండి మార్చి వరకు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. దీనిలో పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన ఎన్‌ఎస్‌సీ, ఉన్నాయి.


ఆర్‌బీఐ వరుసగా ఐదోసారి రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. రెపో రేటును 4 శాతం నుంచి 6.25 శాతానికి పెంచారు. కానీ ప్రభుత్వం అనేక చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచలేదు. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 6.8 శాతం, సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ అలాగే ఉంటుంది. ఇప్పుడు రెపో రేటును 2.25 శాతం పెంచిన తర్వాత, ఈ పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచవచ్చని భావిస్తున్నారు.


మూడవ త్రైమాసికంలో కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి పెంచారు. మెచ్యూరిటీ వ్యవధిని 124 నెలల నుంచి 123 నెలలకు తగ్గించారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటును 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెంచారు. నెలవారీ ఆదాయ ఖాతా పథకంపై 6.6 శాతానికి బదులుగా, పోస్టాఫీసు రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 5.5 శాతానికి బదులుగా 6.7 శాతం, 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 5.5 శాతానికి బదులుగా 5.7 శాతానికి 5.8 శాతం పెంచారు..


ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి బలహీనత, వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా గత ఏడాది కాలంలో ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరిగింది. అయినప్పటికీ ఈ బాండ్లతో అనుసంధానించబడిన ఎన్‌ఎస్‌సీ, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు వాటి వడ్డీ రేట్లను మార్చలేదు.. కానీ రాబడుల కంటే 25 నుండి 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండాలని తెలిపింది..


మరింత సమాచారం తెలుసుకోండి: