ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఘోర పరాజయాన్ని పొందడంతో, 2024 లో జరుగనున్న ఎన్నికల్లో అయినా గెలుపును దక్కించుకుని అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అంతే కాకుండా వైసీపీ ఈ మూడున్నరేళ్ళ పాలనా కాలంలో చేసిన తప్పిదాలు మరియు పొరపాట్లను ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రయోజనం పొందడానికి టీడీపీ పథకాలను రచిస్తోంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు ప్రజలలోకి వెళుతూ అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయద్దని... టీడీపీకి ఓటు వేయాలని ఘంటాపథంగా చెబుతూ వస్తున్నారు. ఇక చంద్రబాబును చూడడానికి లక్షల మంది జనం సభకు తరలి వస్తుండడం విశేషం.

గతంలో ఇదే విధంగా చాలా సభలు చంద్రబాబు నిర్వహించినా అంతగా జనం వచ్చే వారు కాదు. ఏదో తూతూ మంత్రంగా ఎటు చూసినా టీడీపీ శ్రేణులు ఉండేవారు. కానీ రీసెంటుగా బాబు సభలకు జనాలు ఒక రేంజ్ లో పోటెత్తి వస్తున్నారు. ఇటీవల ముగిసిన కందుకూరు సభకు కోకొల్లలుగా జనాలు వచ్చి చంద్రబాబు సభను తిలకించారు. కానీ దురదృష్టవశాత్తూ అదే సభలో జనాల మధ్య తొక్కిసలాట జరగడంతో 8 మంది మరణించారు. ఈ దుర్ఘటన మినహా టీడీపీ సభ విజయవంతం అయిందనే చెప్పాలి. ఇక నిన్న రాత్రి గుంటూరులో టీడీపీ ఎన్ ఆర్ ఐ విభాగం సంక్రాంతికి చంద్రన్న వస్త్ర కానుకను పంపిణీ చేస్తుండగా జనాలు హోరెత్తారు.

అయితే కందుకూరు సభలో లాగే ఇక్కడ కూడా తొక్కిసలాట జరిగి ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. దీనితో చంద్రబాబు సభ పెడితే మనుషుల మరణాలు తప్పవు అన్న రీతిలో వైసీపీ విమర్శలు చేస్తోంది. కానీ వైసీపీ పై ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ రెండు సభలలోనూ చంద్రబాబు కోసం తరలి వెళ్లారు అని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. మాకు ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈ విధమైన విమర్శలు వైసీపీ చేస్తోంది అంటూ టీడీపీ డిఫెండ్ చేసుకుంటోంది. ఎన్నికల ముందు టీడీపీకి వస్తున్న స్పందన పట్ల వైసీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: