ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఓ అయోధ్య ఉంది తెలుసా.. అవును నిజమే. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని గొల్లల మామిడాల గ్రామంలో ఈ రామాలయం ఉంది. అందులో శ్రీ కోదండ రామస్వామి కొలువై ఉన్నాడు. ఇక ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్నే మరో అయోధ్యగా పిలుస్తారు. దీన్నే కోనసీమ అయోధ్య అని కూడా అంటారు.