అవును ప్రస్తుత రాజకీయ పరిస్దితులను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఆదివారం పూర్తయిన ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తే కేంద్రంలో ఏ కూటమికీ సంపూర్ణ అధికారం దక్కే అవకాశాలు కనిపించటం లేదు. ఆ విషయం ఇటు బిజెపి, అటు కాంగ్రెస్ కు అర్ధమైపోవటంతో కొత్త మిత్రుల కోసం వెతుకులాగ మొదలుపెట్టాయి.

 

ఇప్పటికే ఎన్డీఏ, యూపిఏ  కూటముల్లోని పార్టీల్లో చాలా వాటి వల్ల ఆ కూటములకు పెద్దగా ఉపయోగాలు ఉండవని స్పష్టమవుతోంది. ఈ పరిస్దితుల్లో ఏ కూటమిలోను లేకుండా తటస్ధంగా ఉన్న ఆరు పార్టీలపైనే అందరి దృష్టి పడింది. ఆ ఆరు పార్టీలే టిఆర్ఎస్, వైసిపి, టిఎంసి, బీజూ జనతాదళ్, బిఎస్పీ, ఎస్పీలు.

 

మొత్తం 543 లోక్ సభ సీట్లలో ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, ఏపి, తెలంగాణా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 186 సీట్లున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బిఎస్పీలు కలిసి పోటీ చేశాయి. వాటికి వచ్చే సీట్లెన్నో సస్పెన్సుగా మారింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 42 స్ధానాలున్నాయి. పశ్చిమబెంగాల్లో కూడా 42 సీట్లే ఉన్నాయి. ఇక ఒడిస్సాలో 21 సీట్లున్నాయి.

 

 ఏపిలో అయితే వైసిపికి 20 సీట్లు వస్తాయనే అంచనాలున్నాయి. అలాగే తెలంగాణాలోని 17 సీట్లలో తమకు 16 వస్తాయని కెసియార్ నమ్మకంగా ఉన్నారు. ఇక పశ్చిమబెంగాల్, ఒడిస్సాల్లో మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ కు ఎన్ని సీట్లొస్తాయో తెలీదు. పై పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయో స్పష్టంగా చెప్పలేకపోయినా బిజెపికి లేదా మిత్రులకు చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయన్న అంచనాలు కూడా కనబడటం లేదు.

 

ఈ పరిస్ధితుల్లో పై ఇటు ఎన్డీఏకీ లేదా యూపిఏకి చెప్పుకోదగ్గ స్ధానాలు రాకపోతే రెండు కూటములకు ఇబ్బందే. అదే సమయంలో తటస్ధంగా ఉన్న పై ఆరుపార్టీలు గనుక 150 స్ధానాలు దక్కించుకోగలిగితే  కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం పై ఆరుపార్టీల అధినేతలకే వస్తుందనటంలో సందేహం లేదు. వీళ్ళల్లో కూడా ప్రయారిటీ బేసిస్ లో వైసిపి స్ధానమెంత అన్నదానిపైనే జగన్మోహన్ రెడ్డికి దక్కే ప్రాధాన్యత ఆధారపడుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: