తెలంగాణలో మున్సిపల్  ఎన్నికలు సమీపిస్తున్న విషయం తెలిసిందే.  కొద్ది రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే నామినేషన్ల దాఖలు ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.  మున్సిపాలిటీల్లో  కార్పొరేషన్లలో రిజర్వేషన్లు కూడా ప్రకటించారు. ఎన్నికలు నిర్వహించేందుకు అంతా సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు పార్టీల నుంచి బి ఫారంలు పొందిన అభ్యర్థులందరూ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. ఓటర్లను ఆకర్షించడంలో లక్ష్యంగా దూసుకుపోతున్నారు అందరు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పితే మిగతా పార్టీల నుంచి ఎక్కువ అభ్యర్థులు మాత్రం కనిపించడం లేదు అన్న టాక్ ఉంది. టిఆర్ఎస్ పార్టీలో మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో నిలబడడానికి ఒక్క స్థానానికి ఏకంగా ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమదే విజయమని అంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

 

 

 ఇక ఎవరికి వారు ప్రచార రంగంలో దూసుకుపోతు ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఏకంగా మున్సిపల్ ఎన్నికల్లో తల్లీకూతుళ్లు అభ్యర్థులుగా బరిలో నిలిచారు. గెలుపు కోసం ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో  తల్లీ కూతుళ్లు ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీలో నిలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పట్టణానికి చెందిన పోలిక నాగమ్మ కుమార్తె అలివేలు... ఇటీవలే పట్టణానికి చెందిన ఓ యువకుడుని   ప్రేమ వివాహం చేసుకుంది. ఇక స్థానికంగానే ఉంటున్న ఆమె పురపాలక ఎన్నికలు 5 అవార్డు నుంచి టిఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగింది. 

 

ఇక ఆమె తల్లి నాగమ్మ అదే వార్డులో  నుంచి కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగింది. దీంతో తల్లి కూతుళ్లు ఉప్పల్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉండడం  సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పట్టణంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక గెలుపు ఎవరిది అన్న దానిపై ఊహాగానాలు కూడా వెలువడుతూనే ఉన్నాయి. కాగా మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. సొంత ఇంటికి చెందినవారే ప్రత్యర్థులుగా  ఉండడం... లేదా సొంత పార్టీకి చెందిన వారు కూడా ప్రత్యర్థులుగా ఉంటారు. పార్టీలు టికెట్ దక్కని వారు రెబల్స్ గా బరిలోకి దిగి తమ సొంత పార్టీ వారినే ప్రత్యర్థులుగా మారిపోతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: