రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల‌కు స‌హ‌న‌మే భూష‌ణం. మ‌రీ ముఖ్యంగా మూడు సార్లు ముఖ్య‌మంత్రి, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే చంద్ర‌బాబుకు స‌హ‌నం మ‌రింత ముఖ్యం. గ‌త ఏడాది ఎన్ని క‌ల త‌ర్వాత ప్ర‌జ‌ల్లోవ‌చ్చిన వ్య‌తిరేక‌పై ఆయ‌న మాన‌సికంగా ప‌రిశీల‌న చేసుకుని ముందుకు సాగాల్సిన త‌రుణంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇప్పుడు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. మాట‌ల తూటా లు పేల్చ‌డం ద్వారా ఏమీ సాధించ‌లేర‌నే విష‌యాన్ని బాబు గుర్తించ‌లేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో మ‌రీ దిగ‌జారి మాట్లాడుతున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

 

తాను నాటిన అమ‌రావ‌తి అనే మొక్క‌ను మొగ్గ‌లోనే తుంపేస్తున్నాడ‌నే ఆవేద‌న జ‌గ‌న్‌పై బాబుకు భారీగానే ఉంటుంది. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. కానీ, ఈ విష‌యంలో ఆయ‌న చేసిన త‌ప్పులు తెలుసుకుని, వాటి ని దిద్దుకుని ప్ర‌జ‌ల‌ను సంఘ‌టితం చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఉంది. దీనిని గ‌మ‌నించడం మానేసిన బాబు.. ప‌రిస్థితులు త‌న‌కు రోజు రోజుకు అన‌నుకూలంగా మారుతుండ‌డంతో బాబులో స‌హ‌నం న‌శిస్తోంద‌నేది వాస్త‌వ‌మే! తాజాగా ఆయ‌న జ‌గ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌లే దీనికి నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

+ జగన్‌ లాంటి దుర్మార్గుడు పరిపాలనలోకి వచ్చినప్పుడు ఇంటికొకరు బయటకు రావాలి. మీలో రో షం, కసి, వీరావేశం రావాలి. నా పోరాటం మీ కో సమే. ‘ఏ1, ఏ2లైన జగన్‌, సాయిరెడ్డి ప్రతి శుక్రవారం కోర్టు గడప తొక్కాల్సిందే. కులం, మతం, ప్రాంతం పేరు చెప్పి ఎన్నికల్లో గెలిచారు.

 

+ ఏసు ప్రభువుపై నమ్మకం ఉంటే జగన్‌ రాజధానిగా అమరావతినే కొసాగించాలి.

 

+ నేను కన్నెర్ర చేస్తే వైసీపీలో ఎవ్వరూ తట్టుకోలేరు. ‘కోడికత్తి’ నాయకుడు తన బాబాయి హత్య ఎవరు చేశా రో చెప్పలేని స్థితిలో ఉన్నారు. జగన్‌ చేసే తప్పుడు పనులు చూ స్తే కోపం కట్టలు తెగుతోంది.

 

+ పోలీసులు లేకుండా దమ్ముంటే ధైర్యంగా తుళ్లూరుకు సీఎం జ‌గ‌న్ రావాలి. అప్పుడు తేల్చుకుందాం.

 

ఇవీ.. తాజాగా అమ‌రావ‌తి ప్రాంతంలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు. వీటిని గ‌మ‌నిస్తే.. ఎవ‌రైనా.. చంద్ర‌బాబు అనే పేరు లేక‌పోయి ఉంటే.. ఎవ‌రండీ బాబూ.. ఈ చిల్ల‌ర నేత‌! అనినోళ్లు నొక్కుకోరా?  కానీ, బాబు అని తెలిసిన త‌ర్వాత కూడా ఇలానే నొక్కుకున్నారు! ఆయ‌న అనుభ‌వం ఏమైంది?  ప్ర‌జ‌లు గ‌తంలో చంద్ర‌బాబుకు ఎలా అధికారం ఇప్పుడు జ‌గ‌న్‌కు కూడా అలానే ప్ర‌జ‌లు అధికారం ఇచ్చారు.. త‌ప్ప‌.. ఆయ‌న ఎవ‌రి నుంచో అధికారం గుంజుకోలేదు. అలాంటి వ్య‌క్తిపై ఇలా దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేయ‌డం బాబు అనుభ‌వానికి ప‌నికిరాద‌ని అంటున్నారు. మ‌రి బాబు గారు త‌న పంథా మార్చుకుంటారో.. ఇంకా అస‌హ‌నం పెంచుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: