చంద్రబాబునాయుడు అవినీతికి సంబంధించి తాను అప్రూవర్ గా మారిపోతానంటూ పెండ్యాల శ్రీనివాస్ ఐటి అధికారులకు రాత మూలకంగా రాసిచ్చినట్లు సమాచారం. ఈనెలలో తన కూతురు వివాహం ఉందని ఆ కార్యక్రమం అయిపోగానే తానే వచ్చి లొంగిపోతానంటూ ఐటి అధికారులకు రాతమూలకంగా శ్రీనివాస్ రాసిచ్చినట్లు తెలిసింది. అప్రూవర్ గా మారిపోతానని చెప్పటం, వివాహ కార్యక్రమం పూర్తియిపోగానే లొంగిపోతానని చెప్పటాన్ని ఐటి అధికారులు వీడియో కూడా తీసి ఉంచుకున్నట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి.

 

నిజానికి ఐదు రోజుల పాటు సోదాల తర్వాత అప్పుడే అదుపులోకి తీసుకుని తమతో పాటు ఢిల్లీకి తీసుకుని వెళ్ళాలని ఐటి అధికారులు నిర్ణయించుకున్నారట. అయితే కూతురు పెళ్ళి ఉందని పెండ్యాల చెప్పటంతో అధికారులు మానవతా దృక్పధంతో ఆలోచించారట. ఎందుకంటే ఇంట్లోకి సోదాల నిమ్మితం వెళ్ళిన అధికారులకు వివాహ శుభలేఖలు కూడా కనిపించాయట. తనను గనుక అరెస్టు చేస్తే కూతురి వివాహం ఆగిపోతుందని చెప్పుకోవటంతో అధికారులు కూడా కాదనలేకపోయారని సమాచారం.

 

అందుకనే సోదాల్లో దొరికిన డైరీల్లోని వివరాలు, పట్టుబడిన డాక్యుమెంట్లు, కంప్యూటర్ల హార్డ్ డిస్కుల వివరాలన్నింటినీ దేనికది విడి విడిగా రికార్డు చేసుకుని ప్రతి స్టేట్ మెంట్ పైనా దేనికదే  శ్రీనివాస్ సంతకాలు తీసుకున్నారట. అదే సమయంలో అప్రూవర్ గా మారిపోయేందుకు తనంతట తానుగా సిద్ధపడుతున్నట్లు మాజీ పిఎస్ చెప్పటాన్ని కూడా అధికారులు వీడియో సాక్ష్యంగా తీసిపెట్టుకున్నారట.

 

అందుకనే శ్రీనివాస్ ఇంట్లో నుండి ఐదు సూట్ కేసుల్లో ఎవిడెన్స్ మెటీరియల్ ను తీసుకుని ఐదు రోజుల తర్వాత ఐటి అధికారులు ఢిల్లీకి వెళ్ళిపోయారు. వివాహం ఎప్పుడయ్యేది చూసుకుని ఆ తర్వాత ఎప్పుడు ఢిల్లీకి వచ్చి లొంగిపోతాడనే విషయాన్ని కూడా మాట్లాడుకున్న తర్వాతే అధికారులు ఇంట్లో నుండి బయటకు వచ్చారట. సో జరిగింది చూస్తుంటే పెండ్యాల దగ్గర కదిలిన తీగ చివరకు చంద్రబాబునాయుడు కేంద్రంగా  డొంక తగులుకోవటం ఖాయమనే వాదన వినబడుతోంది. మరి అప్రూవర్ గా మారిపోయిన తర్వాత శ్రీనివాస్ ఇంకేమి సంచలనాలు చెబుతాడో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: