ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు తానేం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కావటం లేదు.  విషయం ఏదైనా, సందర్భం ఏదైనా సరే మీడియాతో మాట్లాడకుండా లేకపోతే జనాలకు కనబడకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు.  కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలను చాలా తక్కువ చేసి మాట్లాడారు. అలాగే గతంలో తాను హుద్ హూద్ తుపాను సందర్భంగా జనాలకు అందించిన స్ధాయిలో నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వానికి చెప్పటమే మరీ విడ్డూరంగా ఉంది. ఇక్కడే చంద్రబాబు తెలివితేటలపై అందరికీ అనుమానాలు మొదలైపోయాయి.

 

కరోనా వైరస్ సందర్భంగా రాష్ట్రం  మొత్తం  లాక్ డౌన్ అయ్యింది కాబట్టి  అర్హులైన పేదలకు నెలకు సరిపడ 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పుతో పాటు వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. జగన్ అలా ప్రకటించాడో లేదో వెంటనే చంద్రబాబు ఇలా జాతిని ఉద్దేశిస్తు  వీడియా సందేశాన్ని వదిలేశాడు. ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలు ఏమాత్రం సరిపోవన్నారు. హుద్ హుదూద్ తుపాను సందర్భంగా తాను ప్రతి బాధిత కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నది సవివరంగా జాబితాతో వినిపించారు.

 

ఇక్కడ చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే హుద్ హుదూద్ తుపాను నష్టం అన్నది కేవలం ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితమైనది. కాబట్టి వాళ్ళకు అప్పట్లో అవసరమైన నిత్యావసరాలేవో చంద్రబాబు అందించాడు. కానీ ఇపుడు కొరోనా వైరస్ అన్నది యావత్ దేశం మొత్తానికి సంబంధించింది. ఇందులో భాగంగానే మొత్తం రాష్ట్రాన్నే లాక్ డౌన్ చేసేశారు.  రాష్ట్రంలోని అర్హులైన పేదలు ఇబ్బందులు పడకూడదనే జగన్ తక్షణ సాయం ప్రకటించాడు.

 

అయితే  చంద్రబాబు మాత్రం ఒప్పుకోవటం లేదు. తాను తుపాను సందర్భంగా ఇచ్చినట్లే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నడు. చంద్రబాబు ఇచ్చినట్లే ఇవ్వాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చవుతుందో అర్ధం అవుతున్నట్లు లేదు. వాస్తవ పరిస్దితులతో సంబంధం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం, జగన్ ను ఎలా ఇబ్బందులు పెడదామా అని చూడటంతోనే చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి సరిపోతోందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: