దేశంలోనే కరోనా కేసులు తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి కానీ.. ఇప్పుడు ఏపీలోనూ  కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖకు చెందిన కరోనా బాధితుడి బంధువుకు వైరస్‌ వచ్చింది. గుంటూరుకు చెందిన మరో రోగి బంధువుకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మొత్తం మీద ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు  పెరిగింది.

 

 

ఇంకా మరో 25 వరకూ రిజల్ట్స్ రావాల్సి ఉంది.  అవి కూడా వస్తే ఇంకెన్ని పాజిటివ్ కేసులు తేలతాయో అన్న ఆందోళన నెలకొంది. ఏపీలో శుక్రవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసుల నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈనెల 19న దిల్లీ నుంచి వచ్చి కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తి భార్యకూ వైరస్‌ సోకినట్లు కన్ ఫామ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. 

 

 

గుంటూరు వ్యక్తితో పాటు ఢిల్లీ వెళ్లి వచ్చిన మరికొందరి నివేదికల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ఇక విశాఖలో మరోకరికి కరోనా వైరస్‌ సోకింది. కొత్తగా కరోనా సోకిన కేసుతో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 4కు పెరిగింది. ఈ నెల 17న బర్మింగ్‌ హోమ్‌ నుంచి విశాఖ వచ్చిన వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అతని ద్వారా మరొకరికి   కరోనా వైరస్‌ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. 

 

ఇక మిగిలిన జిల్లాల్లోనూ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. కడప జిల్లాలో కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో 31 మంది నమూనాలను వైద్యులు సేకరించారు. వీరిలో 22 మందికి నెగిటివ్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇంకా 9 మంది నివేదిక ఇంకా రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: