మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృత్యుంజయులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు. స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది త్యాగధనులు మత ప్రాణాలు ఫణంగా పెట్టి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయం తెలిసిందే. తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావుల్లో ఒకరు గోపాల కృష్ణ గోఖలే.  సామాజిక సేవకుడు... భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.

 

1884లో ఎఫిన్‌స్టోన్ కళాశాల నుంచి విద్యను పూర్తి చేశాడు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించడం వలన ఆయన ఆంగ్లంలో నిష్ణాతుడవడమే మాకుండా పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు. పాశ్చాత్య తత్వ శాస్త్రాన్నీ ఆకళింపు చేసుకున్నాడు. జాన్ స్టువార్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ లాంటి తత్వవేత్తల భావనలను అమితంగా అభిమానించేవాడు.  1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రముఖపాత్ర వహించాడు.

 

1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటుచేశాడు. బ్రిటీష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకున్ననూ భారతీయులలో జాతీయతాభావాన్ని పెంపొందించడానికి కృషిచేశాడు.  జాన్ స్టువార్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ లాంటి తత్వవేత్తల భావనలను అమితంగా అభిమానించేవాడు. ఇలా దేశంలో ఎంతో మంది త్యాగ పురుషులు బ్రిటీష్ వారిపై పోరు సల్పి దేశ స్వాతంత్రాన్ని సాధించారు.  అందుకే ఇలాంటి మహనీయులను ప్రతి భారతీయుడు గుర్తు పెట్టుకోవాలని అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: