దేశవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా అనేక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం జరుగుతుంది. దీంతో ప్రజలు అందరూ కూడా భయాందోళనలతో జీవనం కొనసాగిస్తున్నారు. ఇక తమిళనాడు రాష్ట్ర విషయానికి వస్తే.. అధిక సంఖ్యలో కేసులు నమోదు అవ్వడం జరుగుతుంది. ఇక తమిళనాడు రాజధాని అయిన చెన్నై నగరంలో కోయంబెడు మార్కెట్ కరోనా వైరస్ హాట్ స్పాట్ గా మారిందనే చెప్పాలి.


 మళ్లీ తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటి వరకు 9227 రెండు కేసులు నమోదు అవ్వగా... కేవలం కోయంబేడు మార్కెట్ లోనే 2600 కేసులు నమోదైనట్లు నోడల్ అధికారి తెలియజేయడం జరిగింది. మార్కెట్ లో పనిచేస్తున్న కార్మికులు అందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించాము అని నోడల్ అధికారి తెలియజేశారు. అందులో 2600 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి అని తెలిపారు. వారు అందరూ కూడా ఎవరితో కాంటాక్ట్ అయ్యారు అన్న విషయాన్ని గమనించతున్నాము అని ఆ అధికారి వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 2.6 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

 


ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 509 పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం జరిగింది. ఇప్పటివరకు కరోనా బారినపడి 64 మంది మృత్యువాత పడ్డారు. అర్బన్ స్లం ప్రాంతాలలో కరోనా ను నివారించడం చాలా అన్నది పెద్ద సవాలుగా మారింది అని నోడల్ అధికారి తెలియజేశారు. ప్రజలందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ముఖానికి మాస్కు ధరిస్తే కానీ చెయ్యలేము అని తెలియజేస్తున్నారు. 

 


అలాగే నిరంతరం చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటే సరిపోదు తదితర కరోనా వైరస్ సూచనలు పాటిస్తే.. సులువుగా కట్టడి చేయవచ్చు అని అధికారి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: