రాజకీయ ఎత్తుగడల విషయంలో ఒక్కో  విషయాన్ని ఒక విధంగా చూసుకోవాలి. ఎవరికివారు ఎత్తుగడలు వేస్తూ తమ దైన శైలిలో రాజకీయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే.. పోతిరెడ్డిపాడు కృష్ణానది డెల్టా  సంబంధించినటువంటి అంశంపై ప్రస్తుతం  చర్చ జరుగుతోంది. అయితే కృష్ణా నది నీటి విషయంలో ప్రస్తుతం సైకలాజికల్ ట్రాప్ నడుస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు రాయలసీమకు రావలసిన అటువంటి నీళ్లను వాడుకోలేక పోవడం వల్ల వృధాగా సముద్రంలోకి వదిలి వెళ్లాల్సి వచ్చింది. 

 


 అయితే పోతిరెడ్డిపాడు నేటి సమస్యలో  మొట్టమొదట వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ. అయితే కృష్ణ డెల్టా  విషయంలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మధ్య కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పుడు వరకు చంద్రబాబు మాత్రం నోరు మెదపలేదు. దీంతో  వైసిపి దీనిపై చాలా స్ట్రాంగ్ గా  టిడిపి పై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అయితే కృష్ణా డెల్టా సమస్యను సాల్వ్ చేయాలి అని ఎవరూ అనుకోవడం లేదని.. కేవలం ఈ సమస్య ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ఇరు రాష్ట్రాల్లో  ఉన్న  రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

 


 అయితే కృష్ణా డెల్టా సమస్య వస్తే ఏం జరుగుతుంది అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారి పోయింది. ఒకవేళ చంద్రబాబు దీని వల్ల నష్టం లేదు అని ఒక మాట చెప్తే నెంబర్వన్ నాయకుడు అవుతారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సమస్య పోయి  రెండు రాష్ట్రాలలో సమన్వయం అయ్యేటువంటి  పరిస్థితి ఉంటుంది. కానీ భవిష్యత్తులో తెలంగాణ టిడిపి నేతలకు మాత్రం సమస్యగా మారిపోతుంది. అందుకే ఆయన పేరు చెప్పకుండా సైలెంట్గా ఉండి పోయారు.ఇక  దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: