వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలిపై ఇప్పుడు జోరుగా ప్రజల్లో చర్చ జరుగుతోంది. జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరు కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ప్రజలు ఇబ్బందులు పడకడా జాగ్రత్తగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరు, ఇవన్నీ ప్రజల్లో జగన్ సమర్థతపై నమ్మకాన్ని పెంచాయి. అయితే ప్రభుత్వం జగన్ పనితీరు బాగున్నా, మిగతా ప్రజాప్రతినిధుల వ్యవహారంలో జనాల్లో కాస్త ఆగ్రహం పెరుగుతున్నట్లుగా అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. జగన్ మొత్తం దృష్టి అంతా సంక్షేమ పథకాలపైనే పెట్టారు. అధికారులతో వాటిని సమర్థవంతంగా అమలు చేయిస్తూ సక్సెస్ అవుతున్నారు.

IHG


 ఇక పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకునే తీరిక లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరిపై ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండగా, మరికొంతమంది నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇసుక, మద్యం పాలసీ, వంటి వ్యవహారాల్లో తరచుగా ఎమ్మెల్యేలు, కొంతమంది ప్రజాప్రతినిధులు తల దూరుస్తూ, చేతివాటం ప్రదర్శిస్తున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


అలాగే మరికొంత మంది వైసీపీ నాయకులు భూదందాలకు పాల్పడుతున్న సంఘటనలు అప్పుడప్పుడు బయటపడుతున్నాయి. తన ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేదని జగన్ చెబుతున్నా, సొంత పార్టీ నాయకులు ఆ విధంగా వ్యవహరించలేకవడం వంటి పరిణామాలు ఆ పార్టీకి తీరని నష్టాన్ని చేకూరుస్తున్నాయి. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇదే వ్యవహార శైలితో ముందుకు వెళ్లారు. ప్రతి పనిలోనూ తానే ఫోకస్ అయ్యే విధంగా చంద్రబాబు చేసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎవర్నీ పట్టించుకోకుండా చంద్రబాబు ఒకసారి హైలెట్ అయ్యేందుకు ఎక్కువ దృష్టి పెట్టేవారు. దీంతో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందనేది ఆయనకు తెలిసేది కాదు. 


ఫలితంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతూ, పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చేవారు. ఆ  ఫలితం ఎన్నికలు తరువాత కానీ చంద్రబాబు కి అర్థం కాలేదు. పైకి అంతా బాగుంది అని అనుకున్నా, ఓట్ల విషయానికి వచ్చేసరికి ప్రజల్లో ఉన్న ఆగ్రహం అంతా టిడిపి చవిచూడాల్సి వచ్చింది. అప్పట్లో జనాలకు చంద్రబాబు పనితీరు పై నమ్మకం ఉన్నా, పార్టీ నాయకుల వ్యవహార శైలి తో విసిగిపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి కూడా వచ్చేలా కనిపిస్తోంది. జగన్ ఎక్కడా అవినీతి వ్యవహారాలకు పాల్పడకపోయినా , ఆ పార్టీ నాయకులు ఆ వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉంటే ,ఆ  ఫలితం జగన్ తో సహా పార్టీ నాయకులు అంతా అనుభవించాల్సి ఉంటుంది.ఈ విషయాలన్నీ జగన్ దృష్టిలో పెట్టుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2024 లోనూ తిరిగే ఉండదు అనేది విశ్లేషకుల అంచన.

మరింత సమాచారం తెలుసుకోండి: