కష్టం వచ్చినప్పుడే మనలోని టాలెంట్ బయటకు వస్తుంది.. సమస్యలు వచ్చినప్పుడే మన బుర్ర ఇంకా చురుకుగా పని చేస్తుంది. ఇప్పుడు అంతా కరోనా కాలం.. ఎక్కడ చూసినా ఎవరిని కదిపినా కరోనా ముచ్చట్లే.. దేశంలో ఏకంగా మిలియన్ సంఖ్యలో కరోనా కేసులు వచ్చేశాయి. ఏ రాష్ట్రం చూసినా కనీసం 10 వేల కరోనా కేసులు కనిపిస్తున్నాయి.

ఇక మన ఇండియా వంటి దేశంలో వైద్య సదుపాయాలు మరీ తక్కువ. ఇప్పటికే ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఇదే తరహాలో కరోనా విజృంభిస్తే అప్పుడు రోగులకు వైద్యం ఎలా అందిస్తాం.? ఇదిగో ఈ సమస్యకు తనవంతుగా ఓ పరిష్కారం చూపిస్తున్నాడు చెన్నై ఐఐటీ పూర్వ విద్యార్థి.

ఆ పరిష్కారం పేరే కరోనా మెడిక్యాబ్.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ విభాగం ఆధ్వర్యంలో శ్రీరామ్ ఈ పోర్టబుల్ ఆసుపత్రిని రూపొందించాడు. ఈ కదిలే ఆసుపత్రిలోవైద్యులకోసం గదులు, ఐసోలేషన్, ఇతర గదులతోపాటు 15 పడకలు ఉంటాయి.

దీన్ని నలుగురు కలిసి తీసుకెళ్లి రెండు గంటల్లో ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చు. సింపుల్ గా నాలుగు భాగాలుగా మడిచేయొచ్చు. ఇప్పుడు ఇలాంటివే కదా కావాల్సింది. వేలకు వేలుగా కేసులు పుట్టుకొస్తున్న సమయంలో ఇలాంటి వినూత్న ఆవిష్కరణలే ఊరటనిస్తాయి. అండగా నిలుస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి