బేసిక్ రెగ్యులరైజేషన్ చార్జెస్ లో ఎంత శాతం రెగ్యులరైజేషన్ కోసం చెల్లించాల్సి ఉంటుందో కూడా ప్రభుత్వం ప్రకటించింది.. మార్కెట్ విలువ 3000 రూపాయల లోపు ఉంటే 25శాతం చెల్లించాలి. మార్కెట్ వాల్యూ 3 వేల నుంచి 5 వేల వరకు ఉంటే బేసిక్ రెగ్యులరైజేషన్ రేట్లలో 50 శాతం.. 5 వేల నుంచి10 వేల వరకు ఉంటే బేసిక్ రెగ్యులరైజేషన్ రేట్లలో 75 శాతం చెల్లించాలి. మార్కెట్ వాల్యూ 10 వేల కంటే ఎక్కువ ఉంటే బేసిక్ రెగ్యులరైజేషన్ చార్జెస్‌లో వంద శాతం చెల్లించాల్సిందే.
బేసిక్ రెగ్యులరైజేషన్ చార్జెస్ ని 100 చదరపు మీటర్ల లోపు ఉంటే చదరపు మీటర్ కి 200 రూపాయల చొప్పున.. 101 నుంచి 300 చదరపు మీటర్లు 400 రూపాయలు, 301 నుంచి 500 చదరపు మీటర్లు చదరపు మీటర్ కి 600 రూపాయలు 500 వందల చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉంటే చదరపు మీటర్ కు 750 రూపాయలుగా నిర్ణయించింది.
ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ను ప్రకటించడానికి ముందే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్రమ లే ఔట్స్ లోని ప్లాట్స్ ని రిజిస్ట్రేషన్ చేయొద్దని నిషేధం విధించింది. దీంతో, అనధికార ప్లాట్స్ యజమానుల్లో , అక్రమ లే ఔట్ ఓనర్లలో గుబులు మొదలయింది. అయితే, ప్రభుత్వం ఒక హెచ్చరిక చేయడానికే చేసిందనే విషయం దీంతో స్పష్టమైంది. అక్రమ దారులు కూడా.. ప్రతీసారి ఈ తలనొప్పి ఎందుకనే భయంతో రెగ్యులరైజ్ చేయించుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి