సాధారణ చేపలు కొన్నట్లుగానే అరుదైన చేపలను కొనేందుకు ఎంతో మంది వ్యాపారులు లక్షలు వెచ్చించి మరీ పోటీపడుతుంటారు. ఇక ఇలా మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఇక తమ వలకు చిక్కిన చేప లక్షలకు విక్రయించి మత్స్యకారులు ఎంతో సంతోష పడి పోతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. అదృష్టం కలిసి వచ్చి మత్స్యకారుడు కి ఒక అరుదైన చేప దొరికింది. దీంతో అతని పంట పండినట్లు అయింది. ఒక్కరోజులో లక్షాధికారి గా మారిపోయాడు. అతనికి దొరికిన అరుదైన చేప భారీ రేటు పలికింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.
ఈ ఘటన కటక్ లో జరిగింది. భద్రక్ తలచి ప్రాంతానికి చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తికి అరుదైన చేప దొరికింది. ఏకంగా అది 1.4 3 లక్షలకు అమ్ముడుపోయింది. చాందిని పల్లి చేపల మార్కెట్ లో నిర్వహించిన వేలంలో కోల్కతాకు చెందిన వ్యాపారి 1.43 లక్షలకు కొనుగోలు చేపను కొనుగోలు చేశారు. అరుదైన చేపను స్థానికంగా తెలియ అని పిలుస్తూ ఉంటారు. మత్స్యకారులకు దొరికిన ఈ చేప ఏకంగా 22 కిలోల బరువు ఉంది. ఈ రకం చేపలు ఎక్కువగా ఔషధ తయారీలో వినియోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు. అందుకే ఈ చేపలకు ఇంత ధర ఉంటుందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి