ప్రస్తుతం దేశంలో శరవేగంగా కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతూన్న  విషయం తెలిసిందే. ప్రస్తుతం  దేశంలో  కరోనా  వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న నేపథ్యంలో కరోనా వైరస్ కు సరైన వ్యాక్సిన్  పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలోనే కరోనా  బాధితులకు ప్రత్యామ్నాయ చికిత్స పైన ఎక్కువగా దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ప్లాస్మా తెరఫీ కరోనా  వైరస్ బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించడంలో తోడ్పడుతుంది అంటూ వైద్యనిపుణులు చెప్పారు. ఇక ప్లాస్మా తెరఫీ మంచి ప్రభావం చూపిస్తుంది అని వైద్య సిబ్బంది చెప్పడంతో ప్రజలందరిలో కాస్త ధైర్యం నిండి  పోయింది.



 కానీ ఆ తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు కరోనా  వైరస్ చికిత్సలో  ప్లాస్మా  తెరఫి ఎలాంటి ప్రభావం చూపడం లేదని చెప్పడంతో ప్రజలందరిలో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇలా ఎంతోమంది ప్లాస్మా తెరఫీ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవలే ఢిల్లీ ఆరోగ్య శాఖ కూడా ప్లాస్మా తెరఫి  గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ప్లాస్మా  తెరఫీ గురించి భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి.



 కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ప్లాస్మా తెరపీలో  చికిత్స చేయడం కారణంగా ఏకంగా రెండు వేల మందికి పైగా ఎంతగానో ప్రయోజనం కలిగిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్  స్పష్టం చేశారు. అందుకే కరోనా చికిత్సలో ప్లాస్మా తెరఫీ కొనసాగించాలంటూ వైద్య నిపుణులకు సూచించారు ఆరోగ్య శాఖ మంత్రి. గతంలో కరోనా వైరస్ బారిన పడిన తన ప్రాణాలను కూడా కాపాడడానికి ప్లాస్మా తెరఫీ ఎంతో ఉపయోగపడింది ఆయన తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి. ప్రస్తుతం కరోనా చికిత్స మార్గదర్శకాలు నుంచి ప్లాస్మా తెరఫీ తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: