భారత్-చైనా సరిహద్దుల్లో ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో చైనా సృష్టించిన ఉద్రిక్తతలు రోజురోజుకు రగిలి పోతున్నాయి తప్ప ఎక్కడా శాంతియుతంగా మాత్రం మారడం లేదు. రెండు దేశాల మధ్య ఈ క్షణంలో యుద్ధం జరుగుతుందో  అన్నది కూడా  ఊహకందని విధంగా ఉంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సరిహద్దుల్లో విస్తరణ వాదంతో ముందుకు వచ్చిన చైనా ఎట్టి పరిస్థితుల్లో భారత్ పై ఆధిపత్యం సంపాదించాలి  అని అనుకుంది. కానీ భారత్ చైనా మొహరించిన ప్రతి చోట కూడా దీటుగా బదులు ఇవ్వడం తో ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది చైనా.



 అందుకే సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు డబుల్  గేమ్ ఆడుతూ భారత్ ను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ చివరికి భారత వ్యూహాల ముందు తలవంచక తప్పలేదు. ఏకంగా  చైనా వ్యూహాత్మక  ప్రదేశాలను సైతం ఆధీనంలోకి తెచ్చుకొని.. భారత్ చైనా కి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో చైనాతో యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలకు ప్రయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేరుస్తుంది.  ఈ విషయాన్ని చైనా రక్షణ రంగం  ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉన్నారు.



 ఇక ఇటీవలే చైనా రక్షణ రంగ నిపుణులు భారత మిస్సైల్ శక్తిపై అంచనా వేశారు. భారత్ రక్షణ రంగంలో బ్రహ్మోస్ మిస్సైల్స్  ఏకంగా 14 వేలకు పైగా ఉన్నాయని ఇటీవల చైనా అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల చైనా వేసిన అంచనా కాస్తా ప్రస్తుతం భారత్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే డి ఆర్ డి ఓ శరవేగంగా అభివృద్ధి చేస్తున్న మిస్సైల్స్ క్షిపణుల శక్తిని చూసి ఏకంగా చైనా వణికి  పోతుందని అందుకే భారత్ ఎంతో వ్యూహాత్మకంగా చైనా భూభాగాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా చైనా ఎదురు తిరగకుండా యుద్ధం చేయకుండా ఇంకా చర్చలు అని కాలం వెల్లదీస్తున్నది  అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: