ఈ మధ్యకాలంలో ఉరుకులు పరుగుల జీవితంతో ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎవరికీ లేకుండా పోయింది అనే విషయం తెలిసిందే .  అంతే కాకుండా చిత్రవిచిత్రమైన ఆహారపు అలవాట్లు కూడా ప్రస్తుతం ఆరోగ్యానికి ఎంతగానో దెబ్బ తీస్తున్నాయి. అయితే కొంతకాలం వరకూ అంతా బాగానే ఉన్నప్పటికీ  ఒక్క సారిగా బరువు ఎక్కువగా పెరిగిపోవడంతో ఆరోగ్య సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇక ముందు నుంచి జాగ్రత్త పడకుండా ఎక్కువగా బరువు పెరిగి పోయిన తర్వాత తగ్గడానికి నానా కష్టాలు పడుతున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే బరువు తగ్గడానికి వివిధ రకాల డైట్ ఫాలో అవడం అంతేకాకుండా గంటల తరబడి అటు జిమ్ లో  కసరత్తులు చేయడం లాంటివి చేస్తున్నారు. అంతే కాకుండా కొంత మంది అయితే ఎలాంటి కష్టం లేకుండా బరువు తగ్గడానికి కొన్ని రకాల ప్రోడక్టులు వాడుతూ చివరికి ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అదేసమయంలో మరికొంతమంది వంటింటి చిట్కాలు వాడి బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బరువు తగ్గడంలో కారంపొడి ప్రభావం కూడా ఎంత గానో  ఉంటుంది అన్నది మాత్రం చాలామందికి తెలియదు. ఇటీవలే దీనికి సంబంధించి అధ్యయనంలో ఆసక్తికర విషయం బయటపడింది.




 సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజువారి వంటకాలలో విరివిగా కారంపొడి వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కారంపొడి వాడకుండా వంటలే చేయరు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అయితే ప్రతి పూట తినే ఆహారంలో కారం పొడి చేర్చుకోవడం వల్ల కొన్ని క్యాలరీల వరకు కరిగించవచ్చు అనే తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కారంపొడి లో క్యాప్సైసిన్ అనే బయో యాక్టీవ్ ప్లాంట్ కాంపౌండ్ వుంటుందని.. ఇది వంటలకు రుచి అందించడంతో పాటు వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది అని ప్రస్తుతం నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా మెటబాలిజం పెంచడంతోపాటు ఫ్యాటి టిస్యూ తగ్గిస్తుందని... అంతేకాకుండా ఆకలిని అరికట్టేందుకు కూడా కారంపొడి ఎంతగానో ఉపయోగపడుతుందని ఇటీవలి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: