అయితే ఆ కథనంపై షర్మిల స్పందించారు. ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి కథనం విషయం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని.. ఈ కథనాన్ని వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలుగా ఆమె అభివర్ణించారు. ఆ కథనాన్ని పూర్తిగా ఖండిస్తున్నానన్నారు షర్మిల. ఏ పత్రిక అయినా.. ఏ ఛానెల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పు అని షర్మిల అంటున్నారు. అలా రాయడం ఒక నీతిమాలిన చర్య అని అన్నారు షర్మిల.
దీనికి తాజాగా ఆంధ్రజ్యోతి ఆర్కే స్పందించారు. నిజానికి తాను చెప్పిన అనేక అంశాలను షర్మిల ఖండించలేదంటున్నారు ఆర్కే. ఎవరో తయారుచేసిన ప్రకటనపై షర్మిల అయిష్టంగా సంతకం చేసినట్టుగా ఆ ప్రకటనను చూస్తే ఎవరికైనా అర్థమవుతుందంటున్నారు. శ్రీమతి విజయలక్ష్మి బెంగళూరులో ఉన్న షర్మిల వద్దకు హుటాహుటిన ఎందుకు వెళ్లారు? పులివెందుల నుంచి ఎవరెవరు బెంగళూరు వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? ఏ పరిస్థితులలో ఆ ప్రకటనపై షర్మిల సంతకం చేసిందీ నాకు తెలియదనుకుంటున్నారా ? అంటూ నిలదీశారు. తాను రాసినవి అసత్యాలని అటు శ్రీమతి విజయలక్ష్మి గానీ, ఇటు షర్మిల గానీ బైబిల్ పట్టుకుని చెప్పగలరా? అలా చెప్పిన రోజు నేను బహిరంగంగా క్షమాపణ చెబుతానంటూ సవాల్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి