చాల మంది పండ్లు తింటూ ఉంటారు. అయితే పండు తినడానికి ఉత్తమ సమయం.. అలాగే, దానికి సరైన సమాధానం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే.. ప్రతి ఒక్కరి ఆహారం, తినే విధానాలు భిన్నంగా ఉంటాయి. కొందరు ఉదయాన్నే లేవగానే తింటే.. ఇంకొందరు భోజనం తర్వాత తింటారు. ఇంకొందరు అన్నంతో పాటే పండును కూడా తినడానికి ఇష్టపడతారు. అయితే బరువు తగ్గడం లేదా మరేదైనా ఆరోగ్య లక్ష్యం మీ మనస్సులో ఉంటే, లేదా మీకు డయాబెటిస్ ఉంటే మీరు పండు తినే సమయాన్ని తప్పక గమనించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా అన్నంతో కలిపి పండు తినకూడదట ఎందుకు అనేది వైద్యనిపుణులు ఇలా చెప్పుకొచ్చారు.

ఇక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజనంతో పాటు గానీ.. లేదా మీ భోజనం తర్వాత గానీ పండు తినకూడదు అనడానికి కొన్ని నిర్ధిష్ట కారణాలున్నాయి. పండ్లలో అస్థిర పోషణ ఉంటుంది. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అయితే భోజనంలోని కొవ్వులు, పిండి పదార్థాలతో పండ్లలోని ప్రోటీన్‌తో జీర్ణం కావడానికి వేచి ఉన్నప్పుడు ఇతర పోషకాలన్నీ పోతాయి. అందువల్ల మీరు  భోజనంతో పాటు ఒక చిన్న గిన్నెడు పండ్లను మాత్రమే తిన్నా కూడా.. అది మీ భోజనానికి ఎక్కువ కేలరీలను జోడిస్తుంది. అంతేతప్ప పండ్లలోని ఇతర పోషకాలేవి మీకు అందకూండా చేస్తుంది.

అలాగే మీ భోజనం తర్వాత పండ్లను తినడం కూడా మంచి అలవాటు కాకపోవచ్చు. ఇది అప్పటికే తిన్న మీ భోజనంలోని కేలరీలను నాశనం చేస్తాయి. వాటిని శరీరానికి ఉపయోగపడని కొవ్వుగా మారతాయి. పండు తినడానికి ఉత్తమ సమయం మీ స్నాక్స్ టైం. ఇతర చిరుతిళ్లకు బదులుగా పండ్లను తినడం మేలు. ఇవి మీకు  ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇది మీ ఆకలిని కూడా తీర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే.. ఉదయాన్నే మొదటి భోజనంగా పండ్లను తినడం కూడా  ఆరోగ్యకరమైన అలవాటు. ఇది రోజును సరైన స్వరంతో ప్రారంభించడంతో పాటు, జీర్ణక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: