ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక రాజకీయ పార్టీగా మారేందుకు జనసేన ఎన్నో రోజుల నుంచి తీవ్రం గా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోర ఓటమి చవి చూసినప్పటికీ  ఎక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయకుండా..  ప్రజల పక్షాన నిలబడి పోరాడారు.  అంతే కాకుండా ప్రతి విషయం పై స్పందిస్తూ విమర్శలకు పోకుండా జనాలకు ఉపయోగ పడే విషయాల పైన స్పందిస్తూ ఒక నిర్మాణాత్మకమైన ప్రతి పక్ష నేతగా కూడా ప్రజల మనసులు గెలుచుకున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.



 ఇక పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా సరైన బలం కోసం జనసేన అధినేత వేచి చూస్తున్నారు అనే విషయం తెలిసిందే.  అయితే ఇటీవలే పంచాయితీ ఎన్నికల్లో జన సేన పార్టీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రధాన ప్రతి పక్షం గా ఉన్న టిడిపి ని కాదని  జన సేన వైపు ఎక్కువగా మొగ్గు చూపారు ప్రజలు. ముఖ్యంగా ఉభయ  గోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో జనసేన అద్భుతమైన విజయాన్ని అందుకుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.



 తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో సత్తా చాటిన జనసేన పార్టీ  అధికార పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. రాజోలులో 21, తాడిపల్లి గూడెం లో 17, పి గన్నవరం లో 17, అమలాపురం లో 11.. నాలుగు నియోజక వర్గాల నుండి 65 పైగా పంచాయతీ లలో జనసేన గెలిచింది. అంతే కాకుండా ఈ నాలుగు నియోజక వర్గాల్లో ఓడిపోయిన స్థానాల్లో కూడా సెకెండ్ ప్లేస్ లో ఉంది జనసేన. ఇలా పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన రిసల్ట్ చూస్తుంటే ఇప్పుడిప్పుడే ప్రజలు జనసేనను నమ్ముతున్నారు అని అంటున్నారు విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి: