సాధారణంగా పొద్దున లేవగానే కడుపు ఎంతో కాళీ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఉదయాన్నే లేచి తీసుకునే ఆహారం విషయంలో మన ఆరోగ్యం ఎలా ఉంటుంది. ఈ రోజు మొత్తం ఎలా గడుస్తుంది అన్నది ఆధారపడిఉంటుంది. అందుకే ఉదయం తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి అని నిపుణులు సూచిస్తూ ఉంటారు అయితే ఉదయాన్నే లేవగానే పరగడుపున నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం ఆ రోజంతా ఉత్సాహంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని నిపుణులు సూచిస్తూ ఉంటారు.


 అయితే ఉదయం నీళ్లు తాగడం వరకు ఓకే గాని నీళ్లు తాగిన తర్వాత ఉదయం పూట పరగడుపున ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అన్న విషయంలో మాత్రం చాలామందికి ఎలాంటి అవగాహన ఉండదు అన్న విషయం తెలిసిందే. అందుకే ఇక ఉదయం సమయంలో కూడా ఇష్టం వచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.  అది కూడా మితంగా కాకుండా అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చి  బాధపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల ఆ రోజు మొత్తం వివిధ రకాల సమస్యలకు ఆహారం కారణం అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ముఖ్యంగా పరగడుపున కొన్ని ఆహార పదార్థాలు తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. ద్రాక్ష,నిమ్మ,నారింజ, బేరి లాంటి పుల్లటిపండ్లను పరగడుపున తినడం అస్సలు మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉండడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి . పరగడుపున ఇవి తింటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా పరగడుపున టీ కాఫీలు లాంటివి తాగితే అసిడిటీ వచ్చే అవకాశం ఉందట. అంతేకాకుండా చిలగడ దుంపలు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయట. మసాలా ఆహారానికి దూరంగా ఉండటం టమాట స్వీట్ లు లాంటివి పరగడుపున తినకపోవడం ఎంతో మంచిది అని చెబుతున్నారు. సోడా  ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోవద్దు అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: