పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో బెంగాల్ రాజకీయాలు మొత్తం వాడివేడిగా మారిపోయాయి. ఇక అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అయితే ఎన్నో రోజుల నుంచి పశ్చిమ బెంగాల్ లో పాగా వెయ్యాలని ప్రయత్నిస్తున్న బిజెపి.. ఇక మరికొన్ని రోజులలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని భావిస్తోంది అన్న విషయం తెలిసిందే. అదేసమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇక అంతకంతకు మద్దతు పెరిగిపోతూనే ఉంది.


 ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది అని చెప్పాలి.ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించు కుంటూ ఉంటున్నారు. ఇక ఇటీవలే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ నమ్మకద్రోహులు బీజేపీకి అభ్యర్థులుగా మారిపోయారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడ్డారు. తూర్పు మేదినీపూర్ లోని  టి.ఎం.సి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు ముఖ్య మంత్రి మమతా బెనర్జీ. ఈ క్రమం లోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారిని నమ్మకద్రోహులుగా అభివర్ణించారు మమతా బెనర్జీ.



 ప్రస్తుతం టీఎంసీ నుంచి బీజేపీ లో చేరిన వారే బిజెపికి అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించిన మమతా బెనర్జీ.. నమ్మక ద్రోహులు ప్రస్తుతం బీజేపీకి అభ్యర్థులుగా మారి పోయారు అంటూ విమర్శలు గుప్పించారు అయితే ఎన్నో రోజుల నుంచి బిజెపి ని నమ్ముకొని చాలాకాలం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న నేతలకు మాత్రం నిరుత్సాహానికి గురవుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.  బిజెపి పార్టీ అల్లర్లు హత్యలు దోపిడీల రాజకీయాలు చేస్తుంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మమతా బెనర్జీ.

మరింత సమాచారం తెలుసుకోండి: