వెంకటకృష్ణ.. చాలా సీనియర్ జర్నలిస్టు. ఈటీవీ, టీవీ5, ఏపీ 24 ఇంటూ 7 వంటి ఛానళ్లలో పని చేశారు. అందువల్ల ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాల వల్ల ఏబీఎన్ ఛానల్ కూడా చాలా వరకూ మేలు జరిగింది. ఏబీన్ ఆంధ్రజ్యోతి టీడీపీ అనుకూల చానల్ అని పేరున్నప్పటికీ వెంకటకృష్ణతో ఉన్న పరిచయం దృష్ట్యా కొందరు డిబేట్లలో పాల్గొనేవారు.


ఇటీవల జగన్ సర్కారును ఏకేస్తూ డిబేట్లు నిర్వహించడంలో వెంకటకృష్ణ ముందున్నారు. ఆంధ్రజ్యోతి నుంచి మూర్తి వెళ్లిపోయాక ఆ ఛానల్‌కు రాజకీయ చర్చలకు వెంకటకృష్ణ బాగా ఉపయోగపడ్డారు. అయితే ఉన్నట్టుండి వెంకటకృష్ణను తొలగించడం వెనుక అవినీతి బాగోతం ఉందని చెబుతున్నారు. వెంకటకృష్ణ ఓ వ్యక్తి నుంచి 50 లక్షలు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారట.


అందుకే ఏబీఎన్‌ యాజమాన్యం ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించిందని చెబుతున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు వెంకటకృష్ణకు కొత్తేమీ కాదు.. గతంలోనూ ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన హౌజింగ్ సొసైటీలో కూడా తనకు కావాల్సినవారికి ప్లాట్లు ఇప్పించుకున్నారన్న అభియోగాలు కూడా ఉన్నాయి.


మొత్తానికి ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ ప్రస్థానం అలా ముగిసిందని చెబుతున్నారు. ఏదేమైనా వెంకటకృష్ణ ఉన్నన్నాళ్లూ పొలిటికల్ డిస్కషన్లు బాగానే నడిపించారు. ఆంధ్రజ్యోతి మీడియా అంటే అది ఎవరికి కొమ్ముకాస్తుందో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎవరికీ పెద్దగా సందేహాలు లేవు. సాక్షి మీడియా అధికారికంగా వైసీపీకి, ఆంధ్రజ్యోతి తదితర మీడియాలు టీడీపీకి అనధికారికంగానా పల్లకీ మోస్తున్నాయన్న సంగతి ఏపీ మీడియాను ఫాలో అయ్యే వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు. అయినా సరే వెంకటకృష్ణ సాధ్యమైనంత వరకూ డిబేట్లను ఆసక్తికరంగా నిర్వహించేవారు. ఏబీన్ ఆంధ్రజ్యోతి టీడీపీ అనుకూల చానల్ అని పేరున్నప్పటికీ వెంకటకృష్ణతో ఉన్న పరిచయం దృష్ట్యా కొందరు డిబేట్లలో పాల్గొనేవారు. ఇక రాజకీయాలు కాకుండా ఇతర అంశాల విషయంలో ఆయన డిస్కషన్లు బాగానే ఉండేవి.  

మరింత సమాచారం తెలుసుకోండి: