
ప్రస్తుతం దేశం ఆర్థికంగా ఇబ్బంది పడటమే కాకుండా కరోనాతో మరణాలను కూడా తీవ్రంగా ఎదుర్కొంటున్నది. రోజు వేల మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచడానికి చాలా మంది తమ వంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త వినోద్ ఖోస్లా అన్ని ఆసుపత్రులకు సహాయం చేస్తానని ముందుకు వచ్చారు. నిధులు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ బిలియనీర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఖోస్లా తండ్రి భారత సైన్యంలో అధికారి. అతి చిన్న వయసులోనే వ్యాపార రంగంలో తనకంటూ ఆయన ఒక గుర్తింపు సంపాదించుకున్నారు.
సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు అయిన ఖోస్లా ఫోర్బ్స్ 400 జాబితాలో 353 వ స్థానంలో ఉన్నారు. ఇక ప్రముఖులు అందరూ కూడా తమ వంతుగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆక్సీజన్ కొరతను తీర్చడానికి టాటా, రిలయన్స్, అధాని వంటి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్రాల్లో సినీ నటులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రబ్భుత్వాలకు తమ వంతు సహకారం అందిస్తున్న సంగతి కూడా తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఇప్పట్లో కట్టడి అయ్యే అవకాశం దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇక మరణాలు కూడా వచ్చే నెల మొదటి వారంలో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.