మద్యపానం ఇప్పటికే ఎంతో మంది జీవితాలను దుర్భరం చేసింది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రతి చోటా హెచ్చరికలు ఉంటాయి  కానీ ఎవరు కూడా ఇలాంటివి పట్టించుకోరు. ఇక ప్రతి రోజు మద్యం తాగుతూ చివరికి మద్యానికి బానిస గా మారి పోయి కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తున్నారు ఎంతోమంది. మరికొంతమంది మద్యం మత్తులో చివరికి రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ తమని నమ్ముకొని ఉన్న కుటుంబాన్ని నట్టేట ముంచేస్తున్నారు. ఇలా మద్యం మత్తు ఎన్నో అనర్థాలకు కూడా కారణం అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో అయితే మద్యం మత్తులో మానవత్వం మరిచి పోయి ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులు ఏకంగా  సాటి మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు.




 వెరసి రోజురోజుకు ఎన్నో దారుణ ఘటన వెలుగులోకి వస్తున్నాయి.  మద్యం మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియని విచక్షణా రహిత జీవితాన్ని గడుపుతున్నారు ఎంతోమంది.  ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తు ఆ కొడుకుని ఉన్మాదిగా మార్చేస్తుంది. తన రక్తాన్ని పంచి భరించలేని నొప్పిని అనుభవించి  జన్మనిచ్చిన ఆ తల్లి ఆ కొడుకుని పెంచి పెద్ద చేసింది అన్న ప్రేమను కూడా మర్చిపోయాడు.  మద్యం మత్తులో పూర్తిగా విచక్షణ కోల్పోయాడు.  చివరికి ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితి లోకి వెళ్ళిపోయి ఏకంగా మద్యం మత్తులో కత్తితో తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు.



 ఈ ఘటన వరంగల్ లో వెలుగులోకి వచ్చింది. పరకాల వికాస్ నగర్ లో కుటుంబ గొడవల కారణంగా తాగిన మైకంలో కత్తితో కన్న కొడుకు వీరంగం సృష్టించి చివరికి విచక్షణ రహితంగా తల్లిపై దాడి చేయడంతో సదరు మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. రాజేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తితో విచక్షణారహితంగా దాడి చేయగా తల్లిదండ్రులతో పాటు ఐదు నెలల గర్భవతి అయిన సోదరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే తల్లి మృతి చెందింది ఇక మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: