మరో ఆరు నెలల్లో సీఎం జగన్, మంత్రివర్గంలో మార్పులు చేయనున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది. అయితే జగన్ మొదట్లో మంత్రివర్గం ఏర్పాటు చేసేటప్పుడు, మళ్ళీ రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేసి, కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పరు. అంటే ఇప్పటికీ జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది. మరో ఆరు నెలల్లో కేబినెట్‌లో మార్పులు జరగనున్నాయి.


అయితే ఈసారి మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారు? అలాగే ఎవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కులాలు, జిల్లాల ప్రతిపాదికన నెక్స్ట్ మంత్రివర్గంలో మార్పులు ఉండటం ఖాయమే. ఈ క్రమంలోనే గుంటూరు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలకు జగన్ బంపర్ ఆఫర్ ఇవ్వొచ్చు. ఈ జిల్లాలకు అదనంగా మరో మంత్రి పదవి ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది.


ఎందుకంటే ఈ మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పునే జగన్ కేబినెట్‌లో ఉన్నారు. విశాఖలో అవంతి శ్రీనివాస్, గుంటూరులో మేకతోటి సుచరిత, అనంతపురంలో శంకర్ నారాయణలు కేబినెట్‌లో ఉన్నారు. అయితే నెక్స్ట్ మంత్రివర్గంలో మార్పులు చేసినప్పుడు జగన్, వీరిని మార్చి కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు. ఒకవేళ మార్చిన, మార్చకపోయిన ఈ మూడు జిల్లాలకు ఖచ్చితంగా రెండేసి మంత్రి పదవులు దక్కడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూడు జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. విశాఖలో 11 మంది, గుంటూరులో 15, అనంతలో 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.


కాబట్టి ఈ మూడు జిల్లాలకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చేలాగానే కనిపిస్తున్నారు. అయితే మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేయడానికి ఈ మూడు జిల్లాల్లోని సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలు సైతం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటినుంచే పదవుల కోసం లాబీయింగ్‌లు కూడా మొదలుపెట్టేశారు. మరి చూడాలి ఈ మూడు జిల్లాలకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారో లేదో? అలాగే మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: