ఇక తాజా కేసులతో ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షల 79 వేల 773కు చేరగా ఇప్పటివరకు 11 వేల 696 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపడం జరిగింది. ఇక తాజాగా 12,292 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే 1 లక్ష 3 వేల 995 కరోనా వైరస్ యాక్టివ్ కేసులున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా 1980 కేసులు నమోదయ్యాయి. ఇక చాలా తక్కువగా విజయనగరంలో 265 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక మరణాల విషయానికి వస్తే ఎక్కువగా చిత్తూరు జిల్లా లో 11 మంది చనిపోయారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా లో 4 మంది , అనంతపురం జిల్లా లో 5మంది , నెల్లూరు జిల్లా లో 8మంది , శ్రీకాకుళం జిల్లా లో 6మంది , తూర్పుగోదావరి జిల్లా లో 7 మంది , విశాఖ పట్టణం జిల్లా లో 7 మంది , విజయనగరం జిల్లా లో 6 మంది , గుంటూరు జిల్లాలో 5 మంది , ప్రకాశం జిల్లాలో 3 మంది , కర్నూలు జిల్లాలో 5 మంది , వైఎస్సార్ కడప జిల్లాలో లో ఇద్దరు మంది , కృష్ణ జిల్లాలో నలుగురు కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి