రాజ‌కీయాల్లో ఒక్కో సారి ఊహించ‌ని ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉంటాయి. రాజ‌కీయంలో ఉండే మ‌జాయే వేరుగా ఉంటుంది. నేత‌లు సైతం తాము ఊహించ‌ని విధంగా ప‌ద‌వులు ద‌క్కించుకుంటారు. అరే వాడు తంతే వెళ్లి గారెల బుట్ట‌లో ప‌డ్డాడురా ? అని కొంద‌రు చెపుతుంటారు. అంటే ఎవ‌రి త‌ల రాత ఎలా ? మారుతుందో ? చెప్ప‌లేం.. రాజ‌కీయాల్లో బ‌ళ్లు ఓడ‌లు... ఓడ‌లు బ‌ళ్లు అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర కేబినెట్లో చోటు ద‌క్కించుకున్న కిష‌న్ రెడ్డి గురించి చెప్పాల్సి వ‌స్తే కిష‌న్ రెడ్డి చాలా ల‌క్కీ ప‌ర్స‌నే అని చెప్పాలి. 2004లో తొలిసారి అప్ప‌టి హిమాయ‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌పున తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. త‌ర్వాత హిమాయ‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ర‌ద్ద‌య్యింది.

2009 - 2014 ఎన్నిక‌ల్లో అంబ‌ర్ పేట నుంచి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2018లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో కేసీఆర్ కిష‌న్ రెడ్డిని ఓడించాలని
పంతం వేశారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ కీలక నేతలంతా కిష‌న్‌నే మెయిన్‌ టార్గెట్ గా పెట్టుకున్నారు. చివరకు ఎంఐఎం సైతం అక్కడ అభ్యర్థిని పోటీ పెట్టలేదు. మైనార్టీ ఓట్లు టిఆర్ఎస్ అభ్యర్థి కి వన్ సైడ్ గా పడడంతో కిషన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అదే కేసీఆర్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి ఉండకపోతే ఆయన నాలుగో సారి కూడా ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ అసెంబ్లీ లోనే ఉండేవారు.

అదే కిష‌న్ రెడ్డి ఓడిపోవ‌డంతో అటు అధిష్టానం ఆయ‌న‌కు సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇవ్వ‌డం.. ఆయ‌న తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌పై 70 వేల ఓట్ల మెజార్టీతో గెల‌వ‌డం జ‌రిగిపోయాయి. పార్టీ ప‌ట్ల కిష‌న్‌కు ఉన్న అంకిత భావం నేప‌థ్యంలో మోడీ ఆయ‌న్ను కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రిని చేశారు. ఇక ఇప్పుడు అదిరిపోయే ప్ర‌మోష‌న్ వ‌చ్చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: