దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. అందరూ అధునాతన జీవనశైలి వైపు అడుగులు వేస్తున్నారు  ఒకప్పటి మూఢనమ్మకాలను ఆచారాలను కూడా ఎదురు పాటించడం లేదు  అందరూ ఎంతో మెచ్యూర్డ్ మైండ్ తో ఆలోచిస్తున్నారు.  అయితే ఇలాంటి రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలను ఎంతో మంది జనాలు నమ్ముతున్నారు అని తెలుపడానికి అక్కడక్కడా కొన్ని రకాల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి.   దొంగ బాబాలు జనాలకు మాయమాటలు చెప్పి ఎప్పుడు జనాలను బురిడీ కొట్టించేందుకు చేసే ప్రయత్నాలు సంచలనంగా మారిపోతుంటాయి. ఇటీవలి కాలంలో ఇలా దొంగ బాబాల కు సంబంధించిన ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి.



 ఏకంగా మాయమాటలతో జనాలను బట్టలో వేసుకునే దొంగ బాబాలు భారీగా డబ్బులు వసూలుచేసి మోసాలకు పాల్పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  అంతేకాకుండా ఎన్నో మాయమాటలు చెప్పి జనాలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక దొంగ బాబు ఇలాగే ఒక వ్యక్తిని తప్పుదోవ పట్టించాడు   అతనికి ఎన్నో రోజుల నుంచి ఎమ్మెల్యే కావాలని కోరిక.  ఈ కోరికను నెరవేర్చుకోవాలని అతడు ఎంతగానో ప్రయత్నించాడు కానీ నెరవేరదు. ఈ క్రమంలోనే ఒక బాబా దగ్గరికి వెళ్ళాడు. ఇక ఆ బాబా చెప్పిన సలహాలు నీచాతి నీచంగా ఉంది. నీ భార్యను వదిలేస్తే ఎమ్మెల్యే అవుతావ్ అంటూ ఆ బాబా చెప్పాడు. అంతేకాకుండా మంత్రి పదవి కూడా దక్కుతుంది అంటూ నమ్మబలికాడు.


 దీంతో దొంగ బాబా మాటల్లో నిండా మునిగిపోయాడు సదరు వ్యక్తి. దొంగ బాబా చెప్పిన విధంగానే భార్యను వదిలించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.ఈ క్రమంలోనే అప్పటినుంచి భార్యను చిత్రహింసలకు గురి చేస్తూ వస్తున్నాడు  విడాకులపై సంతకం పెట్టాలి అంటూ హింసించేవాడు. కానీ సదరు మహిళ మాత్రం విడాకులు తీసుకునేందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే ఇక రోజురోజుకూ టార్చర్ ఎక్కువైంది. దీంతో విసిగిపోయిన ఆ మహిళా పోలీసులను ఆశ్రయించింది. ఇక భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగ బాబా పేరు కూడా బయటకు వచ్చింది. ఇక ఆ వ్యక్తిని కూడా అరెస్టు చేసి ప్రస్తుతం విచారిస్తున్నారు పోలీసులు. మహారాష్ట్రలోని పూణేలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన

మరింత సమాచారం తెలుసుకోండి: