చదువుకు వయస్సుతో పని లేదు అని చెబుతూ ఉంటారు అందరూ..  చదువుకోవాలనే ఆశ పట్టుదల ఉండాలే కాని ఏ వయసులో అయినా సరే చదువుకోవచ్చు అని సూచిస్తూ ఉంటారు   అయితే అప్పటికే ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వాళ్ల చదువు మాత్రం పూర్తి చేయాలని ఎంతో మంది పట్టుదలతో ఉంటారు  ఈ క్రమంలోనే  మధ్యలో ఆగిపోయిన చదువులు మళ్ళీ కొనసాగించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక ప్రముఖ వ్యక్తులు సైతం ఇలా ఆగిపోయిన చదువును మళ్ళీ కొనసాగిస్తూ పరీక్షలు రాయడం హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 గతంలో ఏకంగా కొంత మంది వృద్ధులు సైతం పదవతరగతి పరీక్షలు రాయడం లాంటివి అప్పట్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇటీవలే ఏకంగా ఒక ఎమ్మెల్యే పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ఎగ్జామ్ హాల్ కి వచ్చారు. అయితే పిల్లలు ఎలా పరీక్షలు రాస్తున్నారు అని పర్యవేక్షించేందుకు అని అనుకుంటున్నారు ఏమో.  అలా అనుకున్నారూ అంటే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఆ ఎమ్మెల్యే పదవ తరగతి పరీక్ష కేంద్రానికి వచ్చింది అక్కడ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను పర్యవేక్షించడానికి కాదు.. ఏకంగా స్వయంగా ఆయన ఎగ్జామ్ రాయడానికి. ఎమ్మెల్యే ఏంటి ఎగ్జామ్ రాయడం ఏంటి.. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎవరైనా ఇంకా చదువుకోవాలనీ అనుకుంటారా అని అంటారు ఈ విషయం తెలిస్తే ఎవరైనా.


 కానీ చదువుకోవాలనే పట్టుదల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆయనను ఎగ్జామ్ రాసేలా చేసింది  ఈ ఘటన ఒడిశా  వెలుగులోకి వచ్చింది. సురద అనే నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పూర్ణచంద్ర స్వైన్ సాధారణ విద్యార్థి లాగా పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్షలు రాశారు. అయితే దూరవిద్య ద్వారా ఇటీవల పరీక్షలు రాసారు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పరీక్షలు జరగకపోవడంతో అందరిని పాస్ చేసింది ప్రభుత్వం  కానీ మార్కులు నచ్చనివారు మళ్లీ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే ఈ ఎమ్మెల్యే  పరీక్ష కేంద్రానికి  చేరుకొని పరీక్షలు రాశారు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: