ద్వి దశాబ్ది ఉత్సవాల్లో ఇవాళ టీఆర్ఎస్ ఉంది
తనని తాను నిరూపించుకుని తెలంగాణ ఏర్పాటుకు
చేసిన కృషికి, సామూహిక శక్తికి నిదర్శనంగా ఉంది
ఓ బక్క చిక్కిన దేహం సాధించిన విజయం
ఈనాటికీ తెలంగాణ కే కాదు ఆంధ్రాకూ ఓ వికాస పాఠం
ఇంత మంచి సమయంలో సమైక్య పాలకులను
ఇంకా ఎందుకు తిట్టిపోస్తారు? అన్నది సందేహం? సందిగ్ధం కూడా!
ఇంటి పార్టీ టీఆర్ఎస్ ఇవాళ తెలంగాణలో దూసుకుపోతోంది. తనదైన ముందుచూపుతో పార్టీకి జవం జీవం పోశారు కేసీఆర్. రెం డు దశాబ్దాల ప్రయాణంలో ఆయన అలసిపోయారు అని అనేందుకు లేదు. అసలు ఆ మాట అంటేనే కేసీఆర్ నవ్వుతారు. ఏం లే దు మీరు ఇంకా బాగా పనిచేయాలని క్యాడర్ కు చెబుతున్నారే కానీ ఏనాడూ అప్పటిలా సమైక్య పాలకులను తిట్టడం లేదు. ప్ర స్తావన వస్తే వేరే విషయం కానీ ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటు సమయంలో కూడా కొందరు అదే అదునుగా కేసీఆర్ అనకపో యినా సమైక్య పాలకులను తిడుతున్నారు. మరి! ఆ రోజు ఉద్యమం నడిచిన రోజు ఈ సమైక్య పాలకులతో మీరు కూడా దోస్తీ క ట్టారు అన్న విషయం మరువకూడదు. ఎంత కాదన్నా రాజశేఖర్ రెడ్డి, ఎంత కాదన్నా చంద్రబాబు నాయుడు మీకు సాయం చే శారన్న విషయం మరువ కూడదు. ఇవన్నీ మరిచిపోయి సమైక్య పాలకులను తిట్టడం సబబు కాదు.
అవును! ఒప్పుకుంటాం కేసీఆర్ సర్ తిరుగులేని నాయకుడు. వ్యూహ చతురత, దార్శినికత అన్నవి రెండు ఉంటాయి ..ఈ రెం డూ పుష్కలంగా ఉంటూనే తనకున్న భాష ను ప్రధానాస్త్రంగా మార్చారు. సామాజిక అస్తిత్వం సంబంధిత గొంతుకల విషయమై ఆయన ఎందరికో మద్దతుగా నిలిచారు. త మ ప్రాంతం - తమ గోడు అనే నినాదం వినిపించిన ప్రతిచోటా తెలంగాణ సంస్కృతి వ్యాప్తి విషయమై ఎంతో ముందుకు పోయారు. ఈ దశలో సమైక్య పాలకులు వెనుకంజ వేశారన్నది నిజం. ముఖ్యంగా ఆస్తుల గొడవ అ న్నది మొదలు కాకపోతే వీరంతా ఎప్పుడో టీఆర్ఎస్ ను అడ్డుకునే వారే! కానీ తె లంగాణ రాష్ట్ర సమితి వాడవాడలా వ్యాప్తి చెంద డం ప్రారంభించాక, ఆంధ్రా పాలకులకు భయం వచ్చింది. ఇందులో భాగంగా వారికీ, తెలంగాణ నాయకులకూ మధ్య ఎవ్వరు అవు నన్నా!కాదన్నా! చేయక తప్పని స్నేహం తప్పక కుదిరింది. ఇవన్నీ మరిచిపోయి సమైక్య పాలకులను తిట్టడం సబబు కాదు. అ వును! అవసరాల రీత్యానే తగవులు కానీ పదవులు కానీ రాజకీయ అనుబంధాలు కానీ..నెరవేర్పులో ఉంటాయి. టీడీపీ నుంచి వెళ్లిపోయాక వేరు కుంపటి పెట్టాక కేసీఆర్ మళ్లీ చంద్రబాబుకు దగ్గరయ్యారా? లేదా?
అయ్యో! ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చొరవ లేకుండానే తెలంగాణ భవన్ కు స్థల కేటాయింపులు జరిగిపోయాయా? ఏమో తెలియదు తెలిసిన గులాబీ నాయకులు తప్పక స్పందించండి. రాజశేఖర్ రెడ్డిని ఒంటరిని చేసే క్రమంలో ఆ రోజు చంద్రబాబు - కేసీఆర్ - ఇతర కమ్యూనిస్టు లీడర్లు మహా కూటమి పే రిట పెద్ద యుద్ధమే చేశారే! అవి మరిచిపోయి టీఆర్ఎస్ కు ఓ అద్దె భవంతి కూడా లేకుండా సమైక్య పాలకులు ఆ రోజు జలదృశ్యం కేంద్రంగా రాజకీయాలు నడిపారు అని చెప్పడం అబద్ధం అవుతుంది.ఇవన్నీ ఎందుకు ఇవాళ్టికీ టీఆర్ఎస్ - టీడీపీ బంధాలు, టీఆర్ఎస్ - వైసీపీ బంధాలు బాగున్నాయి కదా! మరెందుకు సమైక్య పా లకులను పత్రికా ముఖంగా తిట్టడం. ఇవన్నీ ఎందుకు గులాబీ బాస్ ఎదిగేందుకు ఓ విధంగా సాయం చేసిందే సమైక్య పాలకులు అయినప్పుడు వారెందుకు ఆయన కార్యాలయం ఏర్పాటును అడ్డుకుంటారు? ఇది నిజంగా జరగని పని! ఒకవేళ టీఆర్ఎస్ కార్యా లయం ఏర్పాటును 2001 ప్రాంతంలో అడ్డుకునే ప్రయత్నాలు జరిగేయే అనుకుందాం తరువాత ఉన్నది సమైక్య పాలకులే కదా! మరి! వారి సహకారం లేకుండానే బంజారా హిల్స్ దారుల్లో (రోడ్ నంబర్ 12) తెలంగాణ భవన్ నిర్మితం అయ్యేదా? ఇన్ని జరిగినా కూడా సమైక్య పాలకులు కేసీఆర్ కు సహక రించలేదు అని చెప్పడం భావ్యం కాదు. వారి రాజకీయ కారణాలో లేదా ఆస్తుల కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధో ఏదో ఒకటి ఆ రోజు టీఆర్ఎస్ కు సహకరించింది అన్నది తి రుగులేని సత్యం. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా కొత్త భవనం (తెలంగాణ భవన్) ఏర్పాటు, శంకు స్థాపన పనులు కూడా జరగనుండడం మంచిదే! తెలుగువారిగా ఓ ప్రాంతీయ పార్టీ ఎదుగుదలను అంతా స్వాగతించాలి. ఇదే సమయంలో రాజకీయ ప్రయోజనాలే పర మావధిగా సమైక్య పాలకులను తిట్టడం మాత్రం కాస్తైనా తగ్గించుకోవాలి. మానుకోవాలి అని రాయను కానీ తగ్గించుకుంటే బెటర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి