ఈ డ్రగ్స్ అన్నీ కూడా గోవా, తమిళనాడు మరియు ముంబై రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు వస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా కేవలం కొరియర్ ద్వారా అనేది వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో మీరే ఆలోచించండి. డ్రగ్స్ లో చాలా రకాలు ఉన్నా అత్యధికంగా హైదరాబాద్ లో అమ్ముడు పోయే అలాగే యువతను ఎక్కువగా ఆకర్షించేవి మాత్రం హెరాయిన్, కొకైన్ మరియు ఎల్ ఎస్ డి బ్లాక్ అనే మూడు రకాల డ్రగ్స్ మాత్రమే అని తెలుస్తోంది. వీటికి ఇక్కడ చాలా డిమాండ్ ఉందట. అంతే కాకుండా ఎవ్వరూ కనుక్కోకుండా వీటికి కొన్ని ముద్దు పేర్లను కూడా పెట్టుకున్నారట ఈ కేటుగాళ్లు. మియాం మియాం, ఎం క్యాట్, వైట్ మ్యాజిక్ మరియు డ్రోన్ లు అనే పేర్లను వాడుతుంటారు.
ఈ డ్రగ్స్ ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. కేవలం 13 గ్రాముల బరువు కలిగిన డ్రగ్ ధర 2000 రూపాయలు నుండి 3000 రూపాయల వరకు పలుకుతుంది అని చెబుతున్నారు. ఈ డ్రగ్స్ దందాను ఎన్నో సార్లు పోలీసులు పట్టుకుంటున్నా కూడా మళ్ళీ ఏదో విధముగా ఈ డ్రగ్స్ ముఠా పేట్రేగిపోతున్నారు. వీరికి అన్ని విధాలుగా సపోర్ట్ లేనిదే హైద్రాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ వ్యాపారం చేయడం అంత సులభం కాదు. మరి ముందు ముందు అయినా ఇలాంటి వారు మారుతారని ఆశిద్దాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి