
సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా దూషిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్ష టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది అని ఆమె అన్నారు. లా అండ్ ఆర్డర్ పై టీడీపీ మాటలు హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు ఆమె. టీడీపీ హయాంలో వంగవీటి మోహన్ రంగ హత్యకు గురయ్యారు అని కామెంట్ చేసారు. జగన్ పై హత్యాయత్నం చేస్తే టీడీపీ నేతలు ఎగతాళి చేశారు అన్నారు. నన్ను రాజీనామ చెయ్యమని సీఎం చెప్తే ఇప్పుడే రాజీనామా చేస్తా అని వ్యాఖ్యానించారు.
అయ్యన్నపాత్రుడు సమాజానికి పట్టిన చీడ అని ఆమె విమర్శలు చేసారు. రాష్ట్ర ప్రజలు కూడా అయ్యన్న పాత్రుడును ఓ మై సన్ అంటారు అన్నారు. ఆత్మాభిమానంతో బతుకుతున్న నన్ను అవమానిస్తున్నారు ఆమె. నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఏంటి ? అని ఆవేదన వ్యక్తం చేసారు. జోగి రమేష్ వెళ్లే సమయానికి గుంపుగా దాడికి యత్నించింది ఎవ్వరు టీడీపీ నేతలు కాదా ? అని నిలదీశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు అని ఆమె పేర్కొన్నారు. టీడీపీ నేతలు వాస్తవాలు మాట్లాడాలి అని హితవు పలికారు. జోగి రమేష్ వెళ్లే సమాచారం రాగానే పోలీసులు ఎలర్ట్ అయ్యారు అన్నారు. లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు వ్యాఖ్యానించారు.