మాజీ సీఎం రోశ‌య్య స‌మైక్య రాష్ట్ర రాజ‌కీయాల్లోనే పెద్ద రాజ‌నీతిజ్ఞుడిగా పేరు పొందారు. కాంగ్రెస్ లో ఇందిరా గాంధీ టైం నుంచే ఆయ‌న రాజ‌కీయాలు స్టార్ట్ చేశారు. ఇందిర తో రోశ‌య్య కు ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉండేది. అయితే ఆయ‌న ఏ నాడు కూడా ప‌ద‌వుల కోసం ఆశ ప‌డ‌లేదు. ఆయ‌న్నే ప‌ద‌వులు వ‌రించాయి. ఇందిర త‌ర్వాత రాజీవ్ గాంధీ వెంటే రోశ‌య్య ఉన్నారు . రాజీవ్ కూడా రోశ‌య్య ను పెద్ద మ‌నిషి గా గుర్తించి ఎంతో గౌర‌వించే వారు. ఆ త‌ర్వాత ఆయ‌న సోనియా గాంధీ వెంట న‌డిచారు. సోనియా మాట రోశ‌య్య ఏనాడు జ‌వ దాట‌లేదు. నాడు కాంగ్రెస్ ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షం లో ఉన్న‌ప్పుడు ఇక్క‌డ పార్టీ అభివృద్ధి కోసం సోనియా గాంధీకి ఎన్నో విలువైన సూచ‌న‌లు చేశారు.

ఆ త‌ర్వాత రోశ‌య్య కు 2004 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న‌కు ఆర్థిక మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. సోనియా త‌ర్వాత వైఎస్ మ‌ర‌ణాంత‌రం ఎంద‌రో సీనియ‌ర్లు ఉన్నా కూడా రోశ‌య్యనే ముఖ్య‌మంత్రిని చేసింది. నాడు ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం కూడా ఉంది. ఆ స‌మ‌యంలో తెలంగాణ కు చెందిన ఎంద‌రో సీనియ‌ర్లు త‌మ‌కు ముఖ్య‌మం త్రి ప‌ద‌వి కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అయితే చివ‌ర‌కు సోనియా మాత్రం రోశ‌య్య అయితే నే ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వం తో పాటు పార్టీని న‌డుపుతార‌ని భావించి ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.

ఇక రోశ‌య్య ఇన్నేళ్ల ప్ర‌స్థానంలో ఏ నాడు కూడా ప‌ద‌వుల కోసం పాకులాడ లేదు. ఆయ‌న‌కే పిలిచి మ‌రీ ప‌ద‌వులు ఇచ్చారు. ఇక రోశ‌య్య పార్థీవ దేహాన్ని ఈ రోజు అమీర్ పేట‌లో ఆయ‌న స్వ‌గృహానికి త‌ర‌లిస్తారు. ఇక పార్టీ నాయ‌కులు, అభిమానుల‌ సందర్శనార్థం రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో గాంధీ భవన్ లో ఉంచి.. అక్క‌డ నుంచే నేరుగా మహా ప్రస్థానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు... రోశయ్య అసమాన్యమైన వ్యక్తి అని కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఆయ‌న త‌న‌కు పెద‌నాన్న లాంటి వారు అని ఆయ‌న‌తో అనుబంధం గుర్తు చేసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: