19 ఏళ్ల టీనేజ్ అమ్మాయి ఒంటరిగా ప్రపంచ సాహసయాత్రకు పూనుకుంది. ఖండాలు, దేశాలు,నదులు, పర్వతాలు దాటేస్తూ యావత్ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ మొక్కవోని ధైర్యంతో 41 దేశాలలో ఒంటరిగా తిరిగొచ్చింది. ఆమె సాహసాన్ని గుర్తించి గిన్నిస్ బుక్ రికార్డు కూడా అందచేసింది. ఇంతకు ఎవరా అమ్మాయి? దేశంలో ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లాలంటేనే కష్టంగా ఉంటుంది. అనుభవం ఉన్నవారికి సైతం రకరకాల వాతావరణ పరిస్థితులు తట్టుకోవడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది బిందె వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ  ముందుకు సాగింది ఈ అమ్మాయి.

 బస్సులోనూ, రైల్లోనూ ఒంటరిగా ప్రయాణించాలంటే మనలో చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ విమానంలో వేల కిలోమీటర్లు ప్రయాణించారు బెల్జియంకు చెందిన 19 ఏళ్ల జెరా రూథర్ ఫర్డ్. ఏకంగా 5 నెలల పాటు ఇంట్లో వాళ్లకు దూరంగా ప్రపంచ దేశాలు చుట్టొచ్చింది. అది ఒంటరిగా, ఓ బుల్లి విమానంలో. అందుకే గిన్నీస్ వరల్డ్ రికార్డు ఆమెను వరించింది. అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా జెరా రూథర్ ఫర్డ్ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకు న్నారు. జెరా రూథర్ ఫర్డ్ కు చిన్నతనం నుంచే పైలట్ గా రాణించాలన్నది ఆమె కల. ఆమె తల్లిదండ్రులు కూడా పైలెట్లే.దీంతో ఆమెకు ఆ కల సాకారం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆరేళ్లకే చిన్నచిన్న విమానాల్లో ప్రయా ణించడం  ప్రారంభించింది. 14 ఏళ్లకే సొంతంగా విమానం నడపడం లో ఆరితేరింది. ఈ క్రమంలోనే ప్రపంచా న్ని ఒంట రిగా చుట్టిరావాలని నిర్ణయించుకుంది. ఆ కలను సాకారం చేసుకునేందుకు 2021 ఆగస్టు 18న శ్రీకారం చుట్టింది జెరా రూథర్ ఫర్డ్. బుల్లి విమానంలో ప్రపంచ యా త్రకు బయలుదేరింది. వాస్తవానికి మూడు నెలల్లోనే ఈ ప్రయాణం పూర్తి కావాలి. కానీ ఐదు నెలల సమయం పట్టింది.

ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వీసా సమస్యల వల్ల రెండు నెలలు ఆలస్యంగా 155 రోజుల తర్వాత గురువారం స్వదేశంలోకి అడుగుపెట్టింది. బెల్జియం ఎయిర్ ఫోర్స్ కు చెందిన నాలుగు విమానాలు ఎస్కార్డ్ గా ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు వచ్చాయి. ప్రపంచ ఒంటరి ప్రయాణంలో 5 ఖండాల్లోని 41 దేశాలు సందర్శించింది జెరా. మొత్తం 52 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఎన్నో ప్రతికూల వాతావరణ పరిస్థితులు చూశానని జెరా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతులు,బాలికలు కూడా తనలాగా ఏవియేషన్ రంగం వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది జెరా రూథర్ ఫర్డ్.

మరింత సమాచారం తెలుసుకోండి: